Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఔను.. నేనంటే ప్రధాని మోడీకి ఇష్టం... బాబును అందుకే దూరం పెట్టారు: విజయసాయిరెడ్డి

అవును.. నేనంటే ప్రధానికి ఇష్టం. నేనే కాదు ఆయన్ను కలిసే ప్రతి ఒక్కరితోను మర్యాదగా మాట్లాడి.. అబద్ధాలు చెప్పకుండా ఉండే వ్యక్తులంటే నరేంద్ర మోడీకి చాలా ఇష్టం. చంద్రబాబు నాయుడును దూరం పెట్టి వైసిపికి మోడీ దగ్గరవుతున్నారన్న ప్రచారం విపరీతంగా జరుగుతోంది. క

ఔను.. నేనంటే ప్రధాని మోడీకి ఇష్టం... బాబును అందుకే దూరం పెట్టారు: విజయసాయిరెడ్డి
, సోమవారం, 19 మార్చి 2018 (19:14 IST)
అవును.. నేనంటే ప్రధానికి ఇష్టం. నేనే కాదు ఆయన్ను కలిసే ప్రతి ఒక్కరితోను మర్యాదగా మాట్లాడి.. అబద్ధాలు చెప్పకుండా ఉండే వ్యక్తులంటే నరేంద్ర మోడీకి చాలా ఇష్టం. చంద్రబాబు నాయుడును దూరం పెట్టి వైసిపికి మోడీ దగ్గరవుతున్నారన్న ప్రచారం విపరీతంగా జరుగుతోంది. కొంతమంది కావాలనే ఈ ప్రచారం చేస్తున్నారు. అదంతా నేను  చెబుతానంటూ విజయసాయిరెడ్డి ఇలా చెప్పుకొచ్చారు. 
 
ఒక పార్లమెంటు సభ్యుడిగా, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను పంచాయతీ బోర్డు సెక్రటరీ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మాత్రమే కాదు అన్ని పొలిటికల్ పార్టీల పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యుల పాత్ర ఉండాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రిని, ఇతర మంత్రులను, రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని అందరినీ కూడా కలవడం జరుగుతోంది. దాంట్లో తప్పేం లేదు. 
 
ప్రధానిని కలవడంలో చంద్రబాబు నాయుడుకు పర్మిషన్ అవసరం లేదు. ప్రజల సమస్యల కోసం, సమస్యల మీద కలిశాం. చంద్రబాబు నాయుడును ప్రధానమంత్రి ఎందుకు కలవడం లేదు. దానికి కారణం ఉంది. మాట మీద నిలబడరు. ఒక్క విషయం చంద్రబాబు నాయుడును చెప్పమనండి.. నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా.. దేశంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీతో బాబు అలియెన్స్ పెట్టుకున్నారు. ఇలా ఒకటి కాదు కేంద్రంలోని ఎన్నో పార్టీలతో బాబు భాగస్వామ్యం పెట్టుకున్నారు. కలిసి ఉండటాన్ని వ్యాపారంగానే బాబు పరిగణిస్తారు. 
 
ఏ ఒక్క రాజకీయ పార్టీతోనైనా ఐదు సంవత్సరాలకు మించి పార్టర్‌షిప్ అన్నది కొనసాగిందా.. అంటే ఆయనకున్న అభద్రతా భావం... ఎవర్నీ నమ్మలేరు. అందుకే ప్రధాని మోడీ, చంద్రబాబు నాయుడును దూరం పెట్టారు. అంతేగానీ విజయసాయిరెడ్డిని మోడీ దగ్గరికి తీసుకున్నారని, వైసిపి బిజెపికి దగ్గరవుతోందని ఇలా రకారకాల పుకార్లు సృష్టిస్తున్నారన్నారు విజయసాయిరెడ్డి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయ నాటకాల్లో చంద్రబాబు దిట్ట.. ఫ్రంట్లు.. టెంట్లు ఎవరైనా వేసుకోవచ్చు : రాం మాధవ్