టీడీపీ అవిశ్వాసం : సభలో అనుకూలం.. వ్యతిరేకం
విభజన హామీలను నెరవేర్చాలని, ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది.
విభజన హామీలను నెరవేర్చాలని, ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం సోమవారం మరోమారు లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో అవిశ్వసానికి అనుకూలంగా ఓటు వేసే పార్టీలు, వ్యతిరేకంగా ఓటు వేసే పార్టీల వివరాలు, ఆయా పార్టీకు ఉన్న లోక్‌సభ సీట్ల సంఖ్య వివరాలను పరిశీలిస్తే,
అవిశ్వాసానికి వ్యతిరేకంగా బీజేపీ (273), శివసేన (18), ఎల్.జే.పి. (06), ఎస్.ఏ.డి (04), అన్నాడీఎంకే (37), 11 మంది ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు ఓటు వేయనున్నారు.
అలాగే, అవిశ్వాసానికి అనుకూలంగా టీడీపీ (16), కాంగ్రెస్ (48), తృణమూల్ కాంగ్రెస్ (34), ఎస్పీ 05, సీపీఐ 01, సీపీఎం 09, ఆప్ 04, ఎంఐఎం 01, బీజేపీ 20, ఎన్.సి.పి. (06), జేడీఎస్ (02) పార్టీలు ఓటు వేయనున్నాయి. వీటితో పాటు.. వైకాపా కూడా అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి.