Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా నాన్న వల్లే నేనెంతో ధైర్యంగా ఆరోగ్యంగా ఉన్నాను : హీరో విశాల్

ఠాగూర్
ఆదివారం, 12 జనవరి 2025 (13:04 IST)
ఇటీవల తన ఆరోగ్యంపై వచ్చిన వదంతులకు హీరో విశాల్ తెరదించారు. తాను ఆరోగ్యంగా బాగానే ఉన్నట్టు చెప్పారు. ఆయన హీరోగా నటించిన మద గజ రాజా చిత్రం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 12వ తేదీ ఆదివారం విడుదలైంది. ఈ చిత్రం ప్రీమియర్ షోను శనివారం రాత్రి చెన్నైలోని ఓ థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ షో విరామ సమయంలో థియేటర్‌కు వచ్చిన ఆయన... ప్రీమియర్ షో చూస్తున్న ప్రేక్షకులు, మీడియాను ప్రత్యేకంగా అభినందించి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు.
 
'మా నాన్న అంటే నాకెంతో ఇష్టం. ఆయన వల్లే నేనెంతో ధైర్యంగా ఉన్నా. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడుతున్నా. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. మూడు లేదా ఆరు నెలలకొకసారి సినిమాల నుంచి విశ్రాంతి తీసుకుని వెళ్లిపోతున్నానని
కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం నాకు ఎలాంటి సమస్యల్లేవు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు నా చేతులు వణకడం లేదు. మైక్ కూడా కరెక్టుగా పట్టుకోగలుగుతున్నా. ఇటీవల మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నా తుది శ్వాస వరకూ మీ అభిమానాన్ని మర్చిపోను. గెట్ వెల్ సూన్, కమ్ బ్యాక్ అంటూ మీరు పెట్టిన సందేశాలు కోలుకునేలా చేశాయి' అని విశాల్ తెలిపారు. 
 
కాగా, విశాల్ హీరోగా సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మదగజరాజ' (Madha Gaja Raja). ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా గత వారం చెన్నైలో చిత్రబృందం ప్రత్యేక ఈవెంట్ నిర్వహించింది. ఇందులో విశాల్ పాల్గొన్నారు. సినిమా గురించి మాట్లాడుతున్న సమయంలో ఆయన చేతులు వణికాయి. పూర్తి నీరసంగా కనిపించారు. దీంతో ఈవెంట్‌లో పాల్గొన్న వారు కంగారు పడ్డారు. దీనిపై యాంకర్ మాట్లాడుతూ.. విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 
 
సుందర్.సి దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు 12 ఏళ్ల క్రితమే పూర్తైనప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ కథానాయికలుగా నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లాస్‌ఏంజెలెస్‌లో ఆగని కార్చిచ్చు... 16కు పెరిగిన మృతులు...(Video)

సన్యాసినిగా మార్చేందుకు కుమార్తెను దానమిచ్చిన తల్లిదండ్రులు.. తర్వాత ఏం జరిగింది?

రాజేంద్ర నగర్‌లో చిరుతపులి కలకలం!

విశాఖ - హైదరాబాద్ వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త!!

క్రీడాకారిణిపై 62 మంది అత్యాచారం ... కోచ్‍‌ - సహ ఆటగాళ్ళు కూడా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments