Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

15 అడుగుల స్టేజీపై నుంచి కిందపడిన కేరళ ఎమ్మెల్యే ఉమా థామస్ (వీడియో)

Uma Thomas

సెల్వి

, గురువారం, 2 జనవరి 2025 (20:21 IST)
Uma Thomas
15 అడుగుల స్టేజీపై నుంచి కేరళకు చెందిన మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్ పొరపాటున కాలుజారి కింద పడిపోయారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి చర్చనీయాంశమైంది. ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. కేరళ కొచ్చిలోని జవహార్‌లాల్ నెహ్రూ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె.. వ్యాఖ్యాత పిలవగానే స్టేజీపైకి వెళ్లారు. 
 
అయితే తన కుర్చీ వద్దకు వెళ్లి కూర్చుబోయేలోపే ఆమె కాలుజారి స్టేజీపై నుంచి కింద పడిపోయారు. స్టేజీ సరిగ్గా లేకపోవడంతో.. 15 అడుగుల ఎత్తు నుంచి జారీ కింద పడ్డారు. కింద మొత్తం కాంక్రీట్ ఉండడంతో ఒక్కసారిగా కింద పడిపోయిన ఎమ్మెల్యే ఉమా థామస్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఉమా థామస్ స్టేజీపైనుంచి పడిపోయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినవారంతా ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Liquor Sales: కొత్త సంవత్సరం.. రెండు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు రూ.684కోట్ల ఆదాయం