Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

Advertiesment
rajinikanth

ఠాగూర్

, శుక్రవారం, 1 నవంబరు 2024 (12:52 IST)
కోలీవుడ్‌కు చెందిన అగ్రహీరో విజయ్ కొత్తగా స్థాపించిన తమిళగ వెట్రి కళం (టీవీకే) మహానాడు అక్టోబరు 27వ తేదీన విజయవంతంగా నిర్వహించారు. ఈ సభకు లక్షలాది మంది తరలివచ్చారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో విజయ్ పార్టీ కీలకంగా వ్యహరించనుందనే బలమైన సంకేతాలను ఈ మహానాడు ద్వారా పంపించింది. 
 
దీపావళి సందర్భంగా తన నివాసానికి తరలివచ్చిన అభిమానులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మహానాడుపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం విజయవంతమైందని చెప్పారు. టీవీకే పార్టీ తొలి మహానాడును చక్కగా నిర్వహించారని కొనియాడారు. అందుకు అతనిని అభినందిస్తున్నానని తెలిపారు. 
 
కాగా, గత నెల 27వ తేదీన విల్లుపురం జిల్లా విక్రవాండి వేదికగా టీవీకే తొలి మహానాడు విజయవంతంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ మహానాడుకు విజయ్ అభిమానులు, మద్దతుదారులు, టీవీకే కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచజ్చారు. అలాగే, తొలి రాజకీయ వేదికపై నుంచి విజయ్ చేసిన రాజకీయ ప్రసంగం కూడా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. 
 
బీజేపీ, డీఎంకేలను తమ ప్రత్యర్థులుగా ప్రకటించిన విజయ్... ఇతర పార్టీలకు స్నేహ హస్తం చాచారు. వచ్చే 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ప్రటించారు. ఇందుకోసం అవసరమైన ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని, అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో భాగస్వాములం అవుతామని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం