Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రమేష్ బాబు అంత్యక్రియలు - టాలీవుడ్ ప్రముఖుల నివాళులు

Ramesh Babu
Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (12:23 IST)
టాలీవుడ్ సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, హీరో రమేష్ బాబు అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలో జరుగనున్నాయి. ఆయన భౌతిక కాయానికి తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. అలాగే, సోషల్ మీడియా వేదికగా తమతమ సంతాపాలను తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు. 
 
కాగా గత కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతూ వచ్చిన రమేష్ బాబు.. శనివారం గుండెపోటు కారణంగా మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోకు తరలించారు. అక్కడ కటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రమేష్ బాబు తల్లి ఇందిరాదేవి కూడా పద్మాలయ స్టూడియోకు చేరుకున్నారు. రమేష్ బాబు భౌతికకాయానికి అనేక మంది సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. 
 
ఇదిలావుంటే, ఘట్టమనేని కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మా శ్రేయోభిలాషులందరినీ కోవిడ్ నిబంధనలకు కట్టుబడి, దహన సంస్కారాల సమయంలో గుమికూడకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని కోరింది. కాగా, రమేష్ బాబు అంత్యక్రియలు మహాప్రస్థానంలో నిర్వహిస్తున్నారు. ఇదిలావుంటే, హీరోగా 20కి పైగా చిత్రాల్లో నటించిన రమేష్ బాబు... కేవలం ఓ నటుడు మాత్రమే కాదు. నిర్మాత కూడా కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం బ్రేక్ ఫెయిల్ : డిప్యూటీ సీఎంకు తప్పిన పెను ప్రమాదం!!

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల

పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్!!

తప్పు చేశా.. ఇకపై బెట్టింగులకు ప్రమోట్ చేయను : శ్యామల

నల్గొండలో టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ - 11 మంది అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments