ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య అంత్యక్రియలు శనివారం ముగిశాయి. ఏపీ ప్రభుత్వ అధికారిక లాంఛలనాలతో ఈ అంత్యక్రియలు పూర్తిచేశారు. ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు.
అంతకుముందు, ఆయన భౌతికకాయాని అమీర్‌పేటలోని నివాసం నుంచి గాంధీ భవన్‌కు తరలించి, కొద్దిసేపు కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు. అక్కడకు పార్టీలకతీతంగా నేతలు వచ్చిన నివాళులు అర్పించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు అంజలి ఘటించారు.
అలాగే, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా రోశయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడతూ, ఏపీ, తెలంగాణ ప్రజలకు రోశయ్య లేని లోటు తీర్చలేనిదన్నా్రు. అసెంబ్లీలో రాజకీయంగా ఘర్షణ పడినా తాము శత్రువులం మాత్రం కాదని చెప్పారు. నాడు వైఎస్‌ఆర్‌కు రోశయ్య ఒక రక్షణ కవచంలా ఉన్నారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.