Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురి సజీవదహనం

Advertiesment
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురి సజీవదహనం
, ఆదివారం, 5 డిశెంబరు 2021 (16:10 IST)
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవదహనమయ్యారు. పూతలపట్టు - నాయుడుపేట రహదారిపై ఓ కారు దగ్దమైంది. ఈ హైవేలో అగరాల వద్ద కారు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నారు. 
 
ఈ మృతులందరినీ విజయనగరం జిల్లా వాసులుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాపు నంబరు ఆధారంగా మృతులను గుర్తించారు. ఏపీ 39 హెచ్ఏ 4003 అనే నంబరు కలిగిన కారులో ఈ ప్రయాణికులంతా పర్యటిస్తూ వచ్చారు. 
 
అయితే, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అలాగే, కారులో నుంచి మంటలు చెలరేగానే అందులోని ప్రయాణికులు ఎందుకు బయటకు రాలేక పోయారు అన్న విషయంపై కూడా పలు అనుమానాలు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖలో ముందుకు వచ్చిన సముద్రం.. కోతకు గురైన విశాఖ ఆర్కే బీచ్