ఆర్మీ జనరల్ బిపిన్ రావత్, మధులికా రావత్‌ల భౌతిక దేహాలను గురువారం సాయంత్రం తమిళనాడు నుంచి సైనిక విమానంలో ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం వారి నివాసంలోనే భౌతిక దేహాలను ఉంచారు.
శుక్రవారం పూట బిపిన్ రావత్ అంత్యక్రియలు జరుగనున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు సాధారణ ప్రజలు సందర్శించేందుకు వీలు కల్పించనున్నారు.
ఆ తర్వాత రావత్ ఇంటి నుంచే అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. కామరాజ్ మార్గ్ ద్వారా కంటోన్మెంట్‌లోని స్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర సాగనుంది. ఇప్పటికే ఈ మార్గంలో అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆర్మీ అధికారిక లాంఛనాలతో వీరికి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.
కాగా తమమిళనాడులోని నీలగిరి జిల్లా కున్నూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రిదళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికాలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.