Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ క్లై'మ్యాక్స్‌ తో బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో రామ్ సినిమా

Webdunia
శనివారం, 3 జూన్ 2023 (18:01 IST)
Ram Pothineni
బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ మేకర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. హీరో పుట్టినరోజు సందర్భంగా ఇటీవల ఫస్ట్ థండర్ (వీడియో గ్లింప్స్) విడుదల చేశారు. పవన్ కుమార్, జీ స్టూడియోస్ సౌత్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి చేశారు.
 
రామ్ హుషారుకు, ఎనర్జీకి లిమిట్స్ ఉండవు. బోయపాటి శ్రీను సినిమాల్లో భారీతనానికి కూడా లిమిట్స్ ఉండవు. వీళ్ళిద్దరూ కలిస్తే... మ్యాగ్జిమమ్ ఉంటుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థండర్. సినిమా ఏ స్థాయిలో ఉంటుందనే హింట్ ఇచ్చారు. 
 
''ఫైనల్లీ... క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. యాక్షన్ సీక్వెన్స్ కోసం 24 రోజులు చిత్రీకరణ చేశాం. ఇది క్లైమాక్స్ కాదు... క్లైమ్యాక్స్'' అంటూ రామ్ ట్వీట్ చేశారు. క్లైమాక్స్ అయితే 'మ్యాక్స్' అంటూ రామ్ పోతినేని మరిన్ని అంచనాలు పెంచారు.   
 
ఆల్రెడీ ఫస్ట్ థండర్‌లో ''నీ స్టేటు దాటలేనన్నావ్... దాటా! నీ గేటు దాటలేనన్నావ్...దాటా! నీ పవర్ దాటలేనన్నావ్... దాటా! ఇంకేంటి దాటేది... నా బొంగులో లిమిట్స్!'' అంటూ రామ్ చెప్పిన డైలాగ్ పాపులర్ అయ్యింది. లిమిట్స్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ సోషల్ మీడియాలో యూత్ ఈ డైలాగ్ చెబుతున్నారు. సంగీత దర్శకుడు తమన్ అందించిన నేపథ్య సంగీతానికి ప్రశంసలు లభిస్తున్నాయి. హీరో పేరు (రాపో - రామ్ పోతినేని) పేరు వచ్చేలా కంపోజ్ చేసిన బీజీఎమ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. యంగ్ హీరోల్లో హీరో పేరు మీద ఈ స్థాయిలో మాస్ బీజీఎమ్  చేయడం ఇదే తొలిసారి అని చెప్పాలి.  
 
త్వరలో సినిమా టైటిల్, ఇతర వివరాలు వెల్లడించనున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 20న తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. 
 
రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, ప్రెజెంట్స్: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్, సంగీతం: ఎస్ థమన్, డీవోపీ: సంతోష్ డిటాకే, ఎడిటింగ్: తమ్మిరాజు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments