Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల నటిస్తున్న చిత్రం పేరు ఆదికేశవ

Advertiesment
Adikesava, Panja Vaishnav Tej
, సోమవారం, 15 మే 2023 (16:54 IST)
Adikesava, Panja Vaishnav Tej
పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ నిర్మాణ సంస్థలు భారీ యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు 'ఆదికేశవ' అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా ప్రపంచాన్ని, అందులోని పాత్రలను పరిచయం చేస్తూ సోమవారం నాడు చిత్ర బృందం ఓ భారీ యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్ ను విడుదల చేసింది.
 
ఆదికేశవ గ్లింప్స్ లో పంజా వైష్ణవ్ తేజ్ మనకు రుద్రగా పరిచయం అయ్యాడు. ఒక చిన్న గ్రామంలో గూండాలు శివాలయాన్ని ఆక్రమించాలని చూస్తుండగా, రుద్ర వారిని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ గొడవ ఎక్కడికి దారి తీసింది?, ఆ తర్వాత ఏం జరిగింది? అనే ఆసక్తిని కలిగించేలా గ్లింప్స్ ఉంది.
 
గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా గ్లింప్స్ ని ముగించిన తీరు ఆకట్టుకుంది. రుద్రగా పంజా వైష్ణవ్ తేజ్ ఉగ్రరూపం చూపించారు. లుక్స్, యాక్షన్ తో అదరగొట్టారు. పవర్ ఫుల్ యాక్షన్ పాత్రలో తేలికగా ఒదిగిపోయారు. ఇది అసలు ఆయనకు మొదటి యాక్షన్ ఫిల్మ్ అనే భావన మనకు కలగదు.
 
అందరి మనసులను దోచుకునే అందమైన చిత్ర పాత్రలో శ్రీలీల నటిస్తుండగా, వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్ నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. ఇందులో ఆయన అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు..
 
శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. గ్లింప్స్ కి ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను పెంచేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాఫీషాపులో లాంచనంగా ప్రారంభమైన ఛూ మంతర్‌ చిత్రం