Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఓకే చెప్పివుంటే శ్రీదేవి నా భార్య అయివుండేది : డాక్టర్ రాజశేఖర్

అపుడు నేను ఓకే చెప్పివుంటే శ్రీదేవి నా భార్య అయివుండేదని హీరో డాక్టర్ రాజశేఖర్ చెప్పుకొచ్చారు. ఆయన గతంలో ఓ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్‌గా, శ్రీదేవి వాళ్

Webdunia
ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (10:37 IST)
అపుడు నేను ఓకే చెప్పివుంటే శ్రీదేవి నా భార్య అయివుండేదని హీరో డాక్టర్ రాజశేఖర్ చెప్పుకొచ్చారు. ఆయన గతంలో ఓ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్‌గా, శ్రీదేవి వాళ్ల నాన్న అడ్వొకేట్‌గా ఒకేచోట పనిచేశారు. వాళ్లకు, మాకు దూరపు బంధుత్వం ఉంది. శ్రీదేవి అమ్మగారికి నేనంటే బాగా ఇష్టం. ఈ నేపథ్యంలో శ్రీదేవిని పెళ్లి చేసుకోమని వాళ్ల ఇంటి నుంచి నాకు ప్రపోజల్ వచ్చింది. 
 
అయితే శ్రీదేవి అప్పటికే సినిమాల్లో ఉండడంతో మా అమ్మ వద్దని చెప్పింది. నేను ఎమ్మెస్ చదవాలని చెప్పి ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పారు. నేను సినిమాల్లోకి రావడం, సినిమావాళ్లను పెళ్లి చేసుకోవడం మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. అందుకే శ్రీదేవితో పాటు శ్రీలత సంబంధాన్ని కూడా వద్దన్నారు' అని రాజశేఖర్ వివరించారు. 
 
ఇకపోతే, శ్రీదేవి మరణవార్త విని సినీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. ఆమె మృతిపై ఆసేతుహిమాచలం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. తెలుగు సినీ ప్రముఖులందరూ శ్రీదేవి మృతిపై ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. అలాగే, హీరో రాజశేఖర్ శ్రీదేవి మరణవార్త విని షాక్ అయ్యారు. ఆమె ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవి కుటుంబంతో తన కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని రాజశేఖర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఆలయం.. ఒకే బావి.. ఒకే శ్మశానవాటిక : మోహన్ భగవత్ పిలుపు

నా ప్రేమ మీ చేతుల్లోనే వుంది.. దయచేసి పాస్ చేసి నా ప్రేమను బతికించండి.. విద్యార్థి వేడుకోలు!!

పాకిస్థాన్‌లో హిందూ మంత్రి కాన్వాయ్‌‍పై దాడి (Video)

ఆన్‌లైన్ గేమ్ కోసం అప్పు - తీర్చేమార్గం లేకు రైలుకిందపడి ఆత్మహత్య!!

ప్రకాశం జిల్లాలో పిడుగుపడింది... రెండు ప్రాణాలు పోయాయి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments