Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతిలోక సుందరి శ్రీదేవి ఎపుడు.. ఎక్కడ చనిపోయారంటే...

అతిలోక సుందరి శ్రీదేవి దివికేగారు. ఆమె శనివారం గుండెపోటుతో మరణించారు. బాలీవుడ్ నటుడు మొహితా మార్వా వివాహం కోసం యుఏఈలోని రాస్ అల్ కైమా వెళ్లిన నటి శ్రీదేవి శనివారం రాత్రి 11 నుంచి 11.30 గంటల మధ్య తుదిశ

Webdunia
ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (10:26 IST)
అతిలోక సుందరి శ్రీదేవి దివికేగారు. ఆమె శనివారం గుండెపోటుతో మరణించారు. బాలీవుడ్ నటుడు మొహితా మార్వా వివాహం కోసం యుఏఈలోని రాస్ అల్ కైమా వెళ్లిన నటి శ్రీదేవి శనివారం రాత్రి 11 నుంచి 11.30 గంటల మధ్య తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. శ్రీదేవి మరణవార్త తెలిసిన వెంటనే ముంబై నుంచి దుబాయ్ బయలుదేరిన ఆమె మరిది సంజయ్ కపూర్ ఈ విషయం చెప్పారు.
 
తమ అభిమాన నటి శ్రీదేవి ఇక లేరని తెలియగానే సినిమా రంగంతో పాటు, ఆమె అభిమానులంతా తీవ్ర విషాదానికి లోనయ్యారు. కేవలం 54 ఏళ్ళ వయసులోనే ఆమె దూరం కావడం జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలియజేస్తూ శ్రీదేవితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
 
శ్రీదేవి ఆకస్మిక మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలియజేశారు. శ్రీదేవి ఇకలేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. లక్షలాది మంది అభిమానులను ఆవేదనకు గురిచేసింది. మూండ్రమ్ పిరై, లమ్హే, ఇంగ్లీష్ వింగ్లీష్ వంటి చిత్రాల్లో ఆమె నటన ఎందరో సాటి నటులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. శ్రీదేవి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని రాష్ట్రపతి ఓ ట్వీట్‌లో తన సంతాప సందేశాన్నిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Suitcase: భార్యను కత్తితో పొడిచి.. మృతదేహాన్ని మడతపెట్టి ట్రాలీ బ్యాగులో కుక్కిన టెక్కీ.. ఆపై జంప్!

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments