Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విస్తరిస్తోంది... బర్త్‌డే సెలెబ్రేషన్స్ వద్దు.. పెళ్లి వాయిదా వేసుకున్నా....

Webdunia
ఆదివారం, 29 మార్చి 2020 (15:37 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోందని, మన దేశంలో కూడా ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని టాలీవుడ్ యువ హీరో నితిన్ అన్నారు. పైగా, ఈ వైరస్ బారినపడకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటూ, ఇంట్లో నుంచి బయటకురాకుండా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అతేకాకుండా, ఈ వైరస్ కారణంగానే వచ్చే నెలలో జరగాల్సిన తన వివాహాన్ని కూడా వాయిదా వేసుకుంటున్నట్టు నితిన్ తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన ట్వీట్ చేశారు. నా అభిమానులకు, తెలుగు ప్రజలకు నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడి ఉన్నాయో మీకు తెలుసు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల ఎక్కడా కూడా నా పుట్టినరోజు వేడుకలు జరపొద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. 
 
అంతేకాదు లాక్‌డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 16వ తేది జరగాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనమందరం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షోభ సమయంలో మన ఇళ్లల్లో మనం కాలు మీద కాలేసుకొని కూర్చొని, మన కుటుంబంతో గడుపుతూ బయటకు రాకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్లు.. అని నితిన్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు ఇవే... మంత్రి నాదెండ్ల

హామీ నెరవేరింది .. సంతోషంగా ఉంది.. మాట నిలబెట్టుకున్నా : పవన్ కళ్యాణ్

Telangana: రూ.6లక్షల అప్పుల బాధ.. యాసిడ్ తాగిన చేనేత కార్మికుడు

విమానాశ్రయ చెత్తబుట్టలో శిశువు మృతదేహం!!

Hyderabad: వేడి నీళ్లతో నిండిన బకెట్‌లో పడి నాలుగేళ్ల బాలుడి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments