సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసేసుకున్న అమలాపాల్... భర్త ఎవరంటే?

శుక్రవారం, 20 మార్చి 2020 (17:25 IST)
అమలాపాల్ సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకుంది. కెరీర్ మంచి పీక్‌లో ఉన్నప్పుడు..చాలా తక్కువ వయసులోనే తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లికి తర్వాత ఏడాది లోపే సినిమాల్లోకి రావడంతో అమలాపాల్ వివాహబంధం తెగిపోయింది. పెళ్లి తర్వాత అమలా సినిమాల్లో నటించే విషయంపై ఇరువురి బేధాబిప్రాయాలు రావడంతో…విడాకులు తీసుకుని విజయ్ అమలాపాల్ దూరమయ్యారు. 
 
ఆ తర్వాత మళ్లీ వరస సినిమాలతో దుమ్ములేపింది అమలాపాల్. మాజీ భర్త విజయ్ రెండో పెళ్లి చేసుకుని హాయిగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. తాజాగా అమలా పాల్ కూడా రెండో పెళ్లి చేసుకుంది. ఇంకా తన భర్తతో లిప్ లాక్ చేస్తూ.. ఓ ఫోటోను కూడా క్లిక్ చేసింది. ఇప్పుడు ఆమె పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అమలా భర్త పేరు భవీందర్ సింగ్..ఇతడు ముంబైలో ప్రముఖ సింగర్ కావడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆది, వర్షిణిల జోడీ అదుర్స్.. రష్మీ, సుధీర్‌లా ఆకట్టుకుంటారా?