Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టరమ్మాయితో యంగ్ హీరో నిశ్చితార్థం - ఫోటోలు వైరల్

Webdunia
ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (17:50 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న కుర్ర హీరోల్లో నిఖిల్ ఒకరు. ఈయన త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన జీవిత భాగస్వామిగా ఓ వైద్యురాలిని ఆహ్వానించనున్నాడు. ఈ మేరకు డాక్టరమ్మాయితో ఆ యంగ్ హీరో నిఖిల్ నిశ్చితార్థం జరిగింది. 
 
ఇటీవల 'అర్జున్ సురవరం' చిత్రంలో నిఖిల్ నటించాడు. గతంలో హ్యాపీడేస్ చిత్రం ద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 
 
తన సినీ కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన కథలను నమ్ముకుంటూ ముందుకెళ్తున్నాడు. 'స్వామిరారా', 'కార్తికేయ', 'ఎక్కడిపోతావు చిన్నవాడా', 'కిరాక్ పార్టీ' సినిమాలతో నిఖిల్ హిట్లు అందుకున్నారు. తాజాగా ఆయన 'కార్తికేయ-2'లో నటిస్తున్నాడు.
 
ఈపరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భీమవరానికి చెందిన అమ్మాయి తేజస్విని‌పై నిఖిల్ మనసుపడి.. గోవాలో ప్రపోజ్ చేసి మెప్పించాడు. అంతేకాదు పెద్దల్ని కూడా ఒప్పించాడు. ఎక్కడైతే ప్రపోజ్ చేశాడో అక్కడే నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు.
 
వివరాల్లోకి వెళితే డాక్టర్ పల్లవి వర్మని ప్రేమించిన నిఖిల్ అందరి సమ్మతితో ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. గోవా‌లో శనివారం (ఫిబ్రవరి 1న)  పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఏప్రిల్ 16వ తేదీన పల్లవి వర్మను వివాహం చేసుకోబోతున్నాడు. డాక్టర్ పల్లవికి నిఖిల్ ప్రపోజ్ చేస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గిన్నిస్ రికార్డులో 63 అడుగుల భారీ బతుకమ్మ.. ఆ పువ్వులను ఏం చేస్తున్నారంటే?

ఏపీకి రానున్న ఎనిమిది ఎయిర్ పోర్టులు.. ఎక్కడెక్కడో తెలుసా?

మందుల విషయంలో గొడవ.. తల్లిని హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: విదేశాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకో తెలుసా?

గల్ఫ్ పనిచేస్తూ రుణాలు తీసుకున్నారు.. కేరళకు 13మంది నర్సులు జంప్.. చివరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments