అక్కడ రెండో పెళ్లి చేసుకుంటే ఆ కళ్యాణ మండపం 50 శాతం రాయితీ ఇస్తుంది. అదే మూడో పెళ్లి చేసుకుంటే 75 శాతం రాయితీ. ఇక నాలుగో పెళ్లి చేసుకునే వాళ్లకు కళ్యాణ మండపాన్నే ఉచితంగా ఇస్తారట. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే ఈ ఆఫర్ దక్కాలంటే.. అయితే, విడాకులు తీసుకోకూడదు. అంతేకాదు, ఆ కళ్యాణ మండపాన్ని మాజీ భార్య లేదా భార్యలు బుక్ చేయాల్సి ఉంటుంది.ఈ న్యూస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.
సాధారణంగా మనదేశంలో ఒక పెళ్లికే అనుమతి వుంటుందన్న సంగతి తెలిసిందే. రెండో పెళ్లి చేసుకోవాలంటే తప్పనిసరిగా మొదటి భార్యకు విడాకులు ఇవ్వాల్సివుంటుంది. చట్టబద్ధంగా ఈ పని జరిగిన తరువాతే రెండో పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. కానీ, పాకిస్తాన్‌లో అలా కాదు. ఒకటి రెండు మూడు నాలుగు ఇలా ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు.
అందుకే అక్కడ ఒకటికంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీన్ని క్యాష్ చేసుకోవాలనుకున్నారు పాకిస్థాన్‌లోని ఓ కళ్యాణ మండపం నిర్వాహకులు. పాకిస్థాన్‌లోని బవల్పూర్‌లో కొత్తగా ఓ కల్యాణమండపం ఏర్పాటు చేశారు.
కొత్తగా కళ్యాణ మండపం ఏర్పాటు చేయడంతో కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నారు. అందుకే రెండో పెళ్లికి 50 శాతం, మూడో పెళ్లికి 75 శాతం, నాలుగో పెళ్లికైతే ఏకంగా కల్యాణ్ మండపాన్ని ఫ్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ వార్త సోషల్ మీడియా పోస్టు చేయడంతో లైక్స్, షేర్లు వెల్లువెత్తుతున్నాయి.