Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్థాన్‌లోని గురుద్వారాపై రాళ్ల దాడి.. భారత్ ఫైర్

పాకిస్థాన్‌లోని గురుద్వారాపై రాళ్ల దాడి.. భారత్ ఫైర్
, శనివారం, 4 జనవరి 2020 (11:44 IST)
పాకిస్థాన్‌లోని గురుద్వారాపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. పాకిస్థాన్‌లో సిక్కులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆ దేశంలోని సిక్కుల భద్రత, సంక్షేమం కోసం వెంటనే చర్యలు చేపట్టాలని భారత విదేశాంగ శాఖ పాక్ ప్రభుత్వాన్ని కోరింది. 
 
గురునానక్ జన్మించిన పాకిస్థాన్‌లోని నాన్‌కానాలో ఉన్న నాన్‌కానా సాహిబ్ గురుద్వారాపై ఈ రాళ్లపై దాడి జరిగింది. దీంతో పాకిస్థానీ సిక్కులు భయంతో వణికిపోయారు. నాన్‌కానా సాహిబ్ గురుద్వారా పవిత్రతను కాపాడతామంటూ గతంలో ఇచ్చిన హామీ ఏమైందని పాక్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. రాళ్లదాడికి పాల్పడిన అల్లరి మూకలపై వెంటనే చర్యలు తీసుకోవాలని భారత్ కోరింది.
 
సిక్కులను లక్ష్యంగా చేసుకుని పాక్‌లో దాడులు జరుగుతున్నాయని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని కోరింది. మరోవైపు పంజాబ్ సీఎం కూడా ఈ ఘటనపై స్పందించారు.
 
గురుద్వారాలో చిక్కుకున్న భక్తులను ఆందోళనకారుల రాళ్లదాడి నుంచి వెంటనే రక్షించాలని కోరారు. గతేడాది ఆగస్టులో సిక్కు యువతి జగ్జీత్ కౌర్‌‌ను అపహరించిన దుండగులు మతమార్పిడి చేసి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇలా ఘటనలు జరగడం గర్హనీయమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఏఏపై పాత వీడియోలు పోస్టుచేసిన ఇమ్రాన్ ఖాన్.. నవ్వుల పాలైన పాక్ ప్రధాని