టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ దశాబ్ధంలో అత్యుత్తమ వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఈ దశాబ్దంలో అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో మంది వికెట్ కీపర్లు వచ్చారు. అయితే కొందరు మాత్రమే విజయవంతం అయ్యారు. మరోవైపు సీనియర్లు కూడా సత్తాచాటారు. విజయవంతమైన జాబితాలో భారత సీనియర్ కీపర్ ఎంఎస్ ధోనీ, శ్రీలంక కీపర్ కుమార సంగక్కర ముందు వరసలో ఉన్నారు.
జొస్ బట్లర్, ముష్ఫికర్ రహీం, క్వింటన్ డికాక్‌లు కూడా రాణించారు. ఈ దశాబ్దంలో వన్డేలపరంగా అత్యుత్తమ కీపర్ ధోనీనే. తనను మించిన కీపర్ లేడనేంతగా ప్రభావం చూపాడు ధోనీ. 2009-2019లో ధోనీ భారత్ తరపున 196 వన్డేలు ఆడాడు.
242 మంది బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ఇందులో 170 క్యాచులు, 72 స్టంపింగ్‌లు ఉన్నాయి. ఇక మొత్తం కెరీర్‌లో 350 వన్డేల్లో 321 క్యాచులు, 123 స్టంపింగ్‌లు చేసాడు. ఫలితంగా ఈ దశాబ్దంలో మహీనే టాప్‌గా నిలిచాడు.