Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంచుగడ్డల కింద 18 గంటలు గడిపిన బాలిక.. కాలు విరిగింది..

మంచుగడ్డల కింద 18 గంటలు గడిపిన  బాలిక.. కాలు విరిగింది..
, గురువారం, 16 జనవరి 2020 (16:39 IST)
మంచుగడ్డల కింద 18 గంటలపాటు 12 ఏళ్ల బాలిక గడిపింది. ఆ 12 గంటలు నరకం అనుభవించింది. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాక్‌కు చెందిన 12 ఏళ్ల సమినా బీబీ 18 గంటల పాటు మంచుగడ్డల కింద నరకం అనుభవించింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ మొత్తం మంచులో మునిగిపోయిన వేళ.. అక్కడి నీలం లోయలో హిమపాతం వల్ల చాలా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. 
 
వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నీలం లోయలో సమినా కుటుంబం ఓ మూడంతస్తుల ఇంట్లో ఆశ్రయం పొందుతుంది. సోమవారం వారుంటున్న ఇంటిపై మంచుగడ్డలు పడి ఆ ఇల్లు మునిగిపోయింది. ఆ ప్రమాదంలో సమినా సోదరి, సోదరుడు ప్రాణాలు కోల్పోయారు. సమినా తల్లి షహనాజ్, ఆమె సోదరుడు మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. 
 
సమినా మాత్రం ఆ ఇంట్లోనే చిక్కుకుంది. దాదాపు 18 గంటల తర్వాత అధికారులు తనను గుర్తించి బయటకు తీశారు. ఆ గదిలో చిక్కుకున్నప్పుడు తాను అసలు నిద్రపోలేదని... ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఎదురుచూస్తూ గడిపానని సమినా తెలిపింది. ప్రస్తుతం సమినా ముజఫరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది. ఈ ప్రమాదంలో సమినా కాలు విరిగింది. ఇంకా సమినా రక్తం కక్కుకుంది. 
 
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్న వైద్యులు తెలిపారు. సమినా బతుకుతుందని తాము అసలు ఊహించలేదని సమినా తల్లి షహనాజ్ అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంతటా హిమపాతం వల్ల గత రెండు రోజుల్లో మరణించిన వారి సంఖ్య 100కు పెరిగిందని పాకిస్థాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లో కమలసేన ప్రభుత్వం తథ్యం : కన్నా లక్ష్మీనారాయణ