Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రష్యాలో రాజకీయ సంక్షోభం : రాజీనామా చేసిన ప్రధాని మెద్వదేవ్

రష్యాలో రాజకీయ సంక్షోభం : రాజీనామా చేసిన ప్రధాని మెద్వదేవ్
, గురువారం, 16 జనవరి 2020 (11:01 IST)
రష్యాలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాజ్యాంగ సంస్కరణలను ప్రతిపాదించారు. దీన్ని దేశ ప్రధానిగా ఉన్న ద్విమిత్రి మెద్వదేవ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను అధ్యక్షుడికి సమర్పించారు. 
 
నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంతో మెద్వదేవ్ ప్రభుత్వం విఫలమైందని అధ్యక్షుడు పుతిన్ భావిస్తున్నారు. దీంతో రాజ్యాంగ సంస్కరణలను పుతిన్ ప్రతిపాదించారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మెద్వదేవ్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. 
 
ఈ క్రమంలో రష్యా తదుపరి ప్రధానిగా మిషుస్తిన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఫెడరల్ ట్యాక్స్ సర్వీసెస్ అధినేతగా ఉన్న ఆయన పేరును అధ్యక్షుడు పుతిన్ ప్రధాని పదవికి ప్రతిపాదించారు. కాగా, నూతన మంత్రివర్గం ఏర్పాటయ్యే వరకు కొనసాగాల్సిందిగా మెద్వదేవ్ మంత్రివర్గాన్ని అధ్యక్షుడు పుతిన్ కోరినట్టు సమాచారం. 
 
కాగా, వ్లాదిమిర్ పుతిన్‌కు మెద్వదేవ్ అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. ఈయన 2012 నుంచి రష్యా ప్రధానిగా ఉన్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే, మెద్వదేవ్‌ను ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డిప్యూటీగా నియమించే అవకాశాలు రష్యా ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ పప్పులు నా దగ్గర ఉడకవ్... టార్గెట్ చేస్తే రిజైన్ చేస్తా : సీఎం యడ్యూరప్ప