Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేరళ ముస్లిం దర్గాల్లో హిందూ వివాహం.. మతసామరస్యానికి ఇదే నిదర్శనం

కేరళ ముస్లిం దర్గాల్లో హిందూ వివాహం.. మతసామరస్యానికి ఇదే నిదర్శనం
, సోమవారం, 20 జనవరి 2020 (10:16 IST)
మత బేధం లేకుండా ముస్లిం పెద్దలు వ్యవహరించారు. వివాహాన్ని మసీదులోనే ఘనంగా నిర్వహించారు. తన బిడ్డకు పెళ్లి చేసే స్థోమత లేకపోవడంతో ఆ పేద ఆడబిడ్డకు ముస్లిం పెద్దలు వివాహం చేశారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తన బిడ్డ వివాహం చేసే స్తోమత లేదని.. సహకరించాలని ఓ పేద తల్లి చేసిన విజ్ఞప్తికి ముస్లిం మత పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దర్గాలోనే ఆ పేద తల్లి విజ్ఞప్తిని నెరవేర్చారు. కేరళలోని చెరుపల్లి జమాత్ మసీదులో ఆదివారం జరిగింది. 
 
ఈ పెళ్లికి ముస్లిం మత పెద్దలు వధువు అంజుకు పది సవర్ల బంగారాన్ని కానుకగా అందజేశారు. ఇంకా వరుడు శరత్ కు రెండు లక్షల రూపాయల కట్నం ఇచ్చారు.  వివాహం అనంతరం పూర్తి శాకాహార విందును ఏర్పాటు చేయగా, పలువురు బంధుమిత్రులు, ముస్లిం పెద్దలు హాజరై, యువ జంటకు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేశామని మసీదు కమిటీ కార్యదర్శి నుజుముద్దీన్ అలుమ్మూట్టిల్ వ్యాఖ్యానించారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాష్ట్రంలో వెల్లివిరిసిన మత సామరస్యానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనకు మరో అణు క్షిపణి