Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాకు ప్రభుత్వాల అండ లేదు : హీరో బాలకృష్ణ

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2023 (13:44 IST)
కరోనా సమయంలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా లేదా అన్న అనుమానంతోనే 'అఖండ' చిత్రాన్ని విడుదల చేసి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నామని, ఆ సమయంలో మాకు ప్రభుత్వాల అండ లేదని, అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపు ఊసే లేదని హీరో బాలకృష్ణ పేర్కొన్నారు. ఆయన తాజాగా నటించిన చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబ‌ర్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 
 
ఇక ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన ఫస్ట్ లుక్‌ పోస్టర్స్ టీజ‌ర్‌ నెట్టింట హల్‌ చల్‌ చేస్తూ.. ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ విడుదలైంది. బాలయ్య పవర్‌ఫుల్ తెలంగాణా స్లాంగ్ డైలాగ్స్, మాసీ యాక్షన్ సన్నివేశాలలో నిండిన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటొంది. 
 
ఈ "భగవంత్ కేసరి" చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం వరంగల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ హాజరయ్యారు. టాలీవుడ్ దర్శకులు గోపీచంద్ మలినేని, బాబీ, వంశీ పైడిపల్లి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. 
 
ఇందులో బాలయ్య మాట్లాడుతూ, తనకు వరంగల్‌తో అనుబంధం ఉందన్నారు. దసరా నవరాత్రుల వేళ భద్రకాళి అమ్మవారే తనను ఇక్కడికి రప్పించారనుకుంటున్నట్టు చెప్పారు. తాను ఈ సినిమాలో తెలంగాణ మాండలికంలో డైలాగులు చెప్పానని వెల్లడించారు.
 
'వీరసింహారెడ్డి' తర్వాత ఏ సినిమా చేయాలా అనుకుంటున్న తరుణంలో అనిల్ రావిపూడి "భగవంత్ కేసరి" కథ చెప్పాడని బాలకృష్ణ తెలిపారు. ట్రైలర్‌లో చూపించింది కొంతేనని, చూడాల్సింది సినిమాలో చాలా ఉందని అన్నారు. 
 
శ్రీలీల ఇందులో తన కూతురిగా నటించిందని బాలయ్య వెల్లడించారు. తర్వాత ప్రాజెక్టులో శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకుంటానని చమత్కరించారు. ఈ మాటే తాను తన భార్య, కుమారుడితో చెప్పానని, దాంతో తన కుమారుడు... అదేంటి డాడీ... ఓవైపు నేను హీరోగా వస్తుంటే ఆమెను నువ్వు హీరోయిన్‌గా తీసుకుంటావా? అని కోప్పడ్డాడని బాలకృష్ణ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్- ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయి.. ఐఫోన్ పార్ట్స్?

TDP: జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం.. చంద్రబాబు నాయుడు ప్రకటన

నర్మాలలో కలిసిన ఆ ఇద్దరు.. కరచాలనం చేసుకున్న కేటీఆర్-బండి సంజయ్ (video)

చంద్రబాబు బాటలో పవన్-ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి.. ర్యాంకులు కూడా ఇస్తారట

Brain cells: పనిపిచ్చి ఎక్కువ గల వారు మీరైతే.. ఇక జాగ్రత్త పడండి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments