Webdunia - Bharat's app for daily news and videos

Install App

వై.ఎస్.ఆర్‌గా మమ్ముట్టి; వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో జీవా యాత్ర 2 ఫ‌స్ట్ లుక్

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2023 (13:19 IST)
Mammootty, Jiva
మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘యాత్ర 2’. ఈ సినిమాలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి,  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, పాత్రలకు సంబంధించిన  ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది. వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి, వై.ఎస్‌.జ‌గ‌న్‌ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టిస్తున్నారు. 
 
ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే, మ‌మ్ముట్టి, జీవా ఇన్‌టెన్స్ లుక్స్‌తో క‌నిపిస్తున్నారు. ‘నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి...నేను వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కొడుకుని’ అనే ఎమోషనల్ డైలాగ్‌ను కూడా పోస్ట‌ర్‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు. పోస్ట‌ర్ చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. 
 
ఏపీ దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించారు. అత్యంత ప్ర‌జాద‌ర‌ణను పొందిన ఈ చిత్రంకు కొన‌సాగింపుగా, వైఎస్‌.ఆర్ త‌న‌యుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా నాయ‌కుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఇప్పుడు ‘యాత్ర 2’ని తెర‌కెక్కిస్తున్నారు. ‘యాత్ర’ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8, 2019లో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు, 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మవుతుంది. 
 
ప్రస్తుతం శ‌ర‌వేగంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మది కెమెరామెన్. సంతోష్ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments