Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ లీలతో హీరోగా చేస్తానని నా భార్య, కొడుకుతో కూడా చెప్పా: బాలకృష్ణ

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2023 (12:59 IST)
Balakrishna, Sri Lee
నందమూరి బాలకృష్ణ నటించిన  ‘భగవంత్ కేసరి'లో  కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ట్రైలర్ వరంగల్ లో జరిగింది. 
 
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..‘‘పోరాటాల పురిటి గడ్డగా పేరొందిన వరంగల్‌ ప్రజలు, నా అభిమానులందరికీ కళాభినందనలు. దసరా నవరాత్రులకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఆ భద్రకాళి అమ్మవారే నన్ను ఇక్కడికి రప్పించారనుకుంటున్నాను. సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మలాంటి ఎందరో పోరాట యోధులను ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాను. పెండ్యాల రాఘవయ్య వరంగల్‌ ఎంపీగా, హనుమకొండ ఎమ్మెల్మేగా, వర్దన్నపేట ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 1984లో నాన్నగారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు గుడివాడ, హిందూపూర్‌, నల్గొండ నుంచి పోటీ చేసి మూడు సీట్లు గెలవడం జరిగింది. అలాంటి మహానుభావులందరి స్మరించుకుంటున్నాను. నేను తొలిసారి ఈ సినిమాలో తెలంగాణ మాండలికంలో మాట్లాడాను. ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తదనమున్న సినిమాలు అందించాలనే తాపత్రయం నాన్న గారి నుంచి పారంపర్యంగా వస్తోంది. 
 
‘అఖండ’ తర్వాత ఏం చేయాలనుకున్న తరుణంలో ‘వీరసింహారెడ్డి’లో చేశాను. అది అన్ని రికార్డులు సృష్టించడం జరిగింది. తర్వాత ఏంటని అనుకుంటున్న తరుణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి లాంటి సరైన సినిమా దొరికింది. బాలకృష్ణ సినిమా అంటే పంచభక్ష పరమాన్నాలు వున్న భోజనంలా అన్నీ వుండాలి. ఇందులో కూడా అన్నీ వుంటాయి. టోటల్ గా డిఫరెంట్ సినిమా ఇది. ట్రైలర్‌లో మీరు చూసింది కొంతే. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. అదంతా దాచి పెట్టాం. దసరాకి ముందు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాం. దసరాకి ముందు దంచుదాం. కొత్త సినిమా చేసేముందు నేను నా పాత చిత్రాల గురించి చర్చించను. 
 
బాబీతో సినిమా చేయబోతున్నాను.  ప్రతి సినిమాని సవాలుగా స్వీకరిస్తాను. చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు నేను చేయగలిగానంటే అది సమిష్టి కృషి, నా అదృష్టం, కళామతల్లి చల్లని దీవెనలుగా భావిస్తున్నాను.  దర్శకుడు అనిల్ రావిపూడి చాలా ప్రతిభావంతుడు. సెట్స్ లో  జోకులు వేస్తూ నవ్విస్తూ ఉండేవాడు. ఈ సినిమా ఒక ప్రయాణం. ఒక వీరసింహా రెడ్డి, సింహా, లెజెండ్, అఖండ. శ్రీరామరాజ్యం. ఆదిత్య 369, భైరవద్వీపం.. ఇలా నా సినిమాలన్నీ ఒక ప్రయాణం. ఈ వేడుకలో మాట్లాడిన చాలా మంది ఎమోషనల్ గా బరస్ట్ అయ్యారు. పాత్రల్లోకి వెళ్ళిపోయారు. ఇంకా ఆ పాత్రల్లో వున్నామంటే సినిమాలో ఆ పాత్రలు ఎలా ఉంటాయో ప్రేక్షకులు ప్రత్యేక్షంగా చూస్తారు. కాజల్ వెర్సటైల్ నటి.  ఇందులో చాలా చక్కని పాత్రని పోషించారు. శ్రీలీల ఇందులో నన్ను చిచ్చా చిచ్చా అని పిలుస్తుంది   తర్వాత సినిమాలో హీరోహీరోయిన్లుగా యాక్ట్‌ చేద్దామని ఆమెతో చెప్పా. ఇదే మాటను నా భార్య, కొడుకుతో కూడా చెప్పా.  ‘ఏంటి డాడీ.. నేను హీరోగా రాబోతుంటే నువ్వేమో ఆమెకు ఆఫర్‌ ఇస్తావా?( నవ్వుతూ) అన్నాడు.  శ్రీలీల చాలా మంచి నటి. ఇందులో చేసిన పాత్ర ఆమె కెరీర్ లో గుర్తుండిపోతుంది. 
 
ఇందులో అర్జున్ రాంపాల్ తో నటించడం గొప్ప అనుభూతి. మా ఇద్దరి కాంబినేషన్ అద్భుతంగా వుంటుంది. మిగతా నటీనటులు అందరూ అద్భుతంగా చేశారు. కెమరామెన్ తమ్ముడు ప్రసాద్ తో మాది చాలా మంచి ప్రయాణం. నా ప్రతి కదలికని ఒడిసిపట్టుకునే కెమరామెన్ తను. నా సినిమా అంటే తమన్ కి పూనకం వస్తుంది.  బాక్సు బద్దలైపోయేలా కొడతాడు. అఖండ థియేటర్స్ లో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలుసు. కరోనా సమయంలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే మీమాంసలో చిత్ర పరిశ్రమ ఉన్న సమయంలో ‘అఖండ’ను విడుదల చేశాం. ప్రభుత్వాలు మాకేం సహకరించలేదు. అదనపు షోలు లేవు. టికెట్‌ రేట్లు పెంచలేదు. ప్రేక్షకులు తరలి వచ్చారు. రికార్డు సృష్టించిందా సినిమా.  పారిశ్రామిక రంగాన్ని ఎలా గుర్తిస్తారో చిత్ర పరిశ్రమను ప్రభుత్వాలు అలాగే గుర్తించాలి. అప్పుడే ప్రభుత్వాలకు మంచి ఆదాయం వస్తుంది. ఇక మా ఎడిటర్ తమ్మిరాజు రాజు చాలా మంచి వర్క్ చేశారు. అలాగే డ్యాన్స్ మాస్టర్స్ , ఫైట్ మాస్టర్స్ ఇలా అందరూ అద్భుతంగా చేశారు. ఈ సినిమా గురించి చాలా వుంది. ఇదొక చరిత్ర, ఎపిక్. వీరసింహా రెడ్డి సినిమా చూసినప్పుడు మగాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అది ఘన విజయం సాధించింది. ఈ సినిమాకి కూడా అఖండ, వీరసింహారెడ్డి లా ఘన విజయం సాధిస్తుంది. ఈ సినిమా చూసి మగాళ్ళు సైతం కన్నీళ్ళు పెట్టుకొని బయటికి వస్తారు. అంత అద్భుతంగా మా దర్శకుడు అనిల్ రావిపూడిగారు ఈ సినిమాని తీర్చిదిద్దారు. మంచి పాటలు, ఫైట్లు, డైలాగులు, యాక్షన్ సీన్స్స్ తో  సినిమా అంతా ఒక పండగలా వుంటుంది. నిర్మాతలు హరీష్ పెద్ది, సాహు గారు చాలా శ్రద్ధతో అన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇన్ని కోట్లమంది అభిమానులని పొందటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేను సంపాదించింది అభిమానుల అభిమానమే. అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భక్తి-ముక్తి, శక్తి-యుక్తి ఈ 4 అవసరం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో శ్రీశ్రీ రవిశంకర్ (video)

మగవాళ్లపై గృహహింస: ‘పెళ్లైన 15 రోజులకే విడాకులన్నారు, ఇంటికి వెళితే దారుణంగా కొట్టి పంపించారు’

జగన్ థర్డ్ డిగ్రీ నుంచి బీజేపీలో ఉండటంతో తప్పించుకున్నా : విష్ణుకుమార్ రాజు

పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో యువకుడి మృతి..

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కారు డ్రైవర్ నెల వేతనం ఎంతో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments