Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భగవంత్ కేసరి నుండి బాలకృష్ణ, శ్రీలీలతో ఎమోషనల్ సాంగ్

Advertiesment
Balakrishna, Srileela
, బుధవారం, 4 అక్టోబరు 2023 (18:20 IST)
Balakrishna, Srileela
‘భగవంత్ కేసరి’ సినిమాలో నందమూరి బాలకృష్ణ తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ కనిపించారు. ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ఫస్ట్ సింగిల్ గణేష్ పాట బాలకృష్ణ , శ్రీలీల మధ్య అందమైన బంధాన్ని చూపించింది. ఈ పాటలో శ్రీలీల, బాలకృష్ణను చిచ్చా అని పిలుస్తూ కనిపించింది. వారి ఎనర్జిటిక్ డ్యాన్స్  మూమెంట్స్ అందరినీ ఆకర్షించాయి.
 
అన్ని వయసుల వారికి నచ్చే విధంగా మాస్, క్లాస్‌లను మెప్పించే కథలను చెప్పడంలో దిట్ట అయిన దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ రోజు, మేకర్స్ ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ ఉయ్యాలో ఉయ్యాలా పాటని విడుదల చేశారు.
 
ఎస్ఎస్ థమన్ స్వరపరిచిన పాట భగవంతం కేసరి ఎమోషన్ ని డిఫైన్ చేస్తోంది. యంగ్ శ్రీలీలతో బాలకృష్ణకు ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని ఇది చూపిస్తుంది. థమన్ పర్ఫెక్ట్ సిట్యుయేషనల్ సాంగ్‌ను స్కోర్ చేశారు. దీనికి అనంత శ్రీరామ్ రాసిన  సాహిత్యం అద్భుతంగా వుంది. ఎస్పీ చరణ్  వోకల్స్ ఈ పాటకు మరింత  ఆకర్షణని జోడించింది.  బాలకృష్ణ, అమ్మాయి ప్రయాణం చాలా ఉద్వేగభరితంగా ఉంది. బాలకృష్ణను ఇంత ఎమోటివ్ నంబర్‌లో చూడటం చాలా రిఫ్రెష్‌గా ఉంది. పాటలాగా విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.
 
సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా, నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. జాతీయ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సి రామ్ ప్రసాద్, ఎడిటర్ తమ్మి రాజు, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
 
భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సడన్ గా బరువు పెరగడం మంచిది కాదని మహేష్ బాబు చెప్పారు : సుధీర్ బాబు