Webdunia - Bharat's app for daily news and videos

Install App

విప్లవ యోధుడు చేగువేరా వర్థంతి సందర్భంగా చే మూవీ టీజర్

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2023 (12:41 IST)
che movie
తెరపై మరో బయోపిక్ రాబోతుంది. క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూపోందుతున్న చిత్రం "చే" లాంగ్ లైవ్ ట్యాగ్ లైన్. క్యూబా  తరువాత ప్రపంచం లో తొలిసారి భారతీయ చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న చేగువేరా బియోపిక్ ఇది. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్ పై బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. 
 
సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో  లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్ , పసల ఉమా మహేశ్వర్  కీలకపాత్రలు పోషిస్తున్నారు.  రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెన్సార్ కు వెళ్లనుంది..
 
ఇటీవలే  చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా ఈమూవీ ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసి చిత్రయూనిట్ ను అభినందించారు.. అక్టోబర్ 9 న క్యూబా పోరాటయోధుడు చేగువేరా వర్ధంతి  సందర్భంగా చిత్రయూనిట్ టీజర్ రిలీజ్ చేసింది.
 
అనంతరం హీరో , దర్శకుడు బి.ఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ... "విప్లవ వీరుడు , యువత స్పూర్తిదాయకుడు చేగువేరా జీవిత చరిత్రను సినిమా గా తీయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము.. ఆయన చేసిన పోరాటలు, త్యాగాలు  ఈ చిత్రంలో తీశాము. అప్పటి  పరిస్థితులకు అద్దం పట్టే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుని, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా ను రూపోందించాం" అని చెప్పారు. "ఈ మూవీ పోస్టర్ ను చేగువేరా కూతురు డా.అలైదా గువేరా విడుదల చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నాం. ..ఆ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది...అక్టోబర్ 9 న విప్లయోధుడు చేగువేరా గారి వర్ధంతి సందర్భంగా టీజర్ రిలీజ్ చెయ్యడం గర్వంగా ఫీల్ అవుతున్నాము అన్నారు.. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకున్న మా సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది.. నవంబర్ లో మా చిత్రాన్ని  రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు..
 
నటీనటులు లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్ సభావత్  నాయక్..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిర్చి యార్డ్‌లోకి ప్రవేశిస్తే అరెస్టు చేస్తాం.. జగన్‌కు అనుమతులు నిరాకరణ

శ్రీవారి సన్నిధిలో బూతు పురాణం.. థర్డ్ క్లాస్ నా కొడుకువి అంటూ రెచ్చిపోయిన నరేష్ (video)

అద్భుతం: బతుకమ్మ కుంటను తవ్వితే నాలుగు అడుగుల్లోనే నీళ్లొచ్చాయా? నిజమెంత?

ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు.. చెరో మూడేసి రోజులు.. బాండ్‌పై సంతకం

భారత్ చేతిలో డబ్బు వుందిగా.. 21 మిలియన్ డాలర్లు ఎందుకు ఇవ్వాలి?: ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments