Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖండ‌లో బాల‌య్య బ‌స‌వ‌న్న‌లు... హైదరాబాదు శివారువే!

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (12:07 IST)
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాలో కనిపించిన బసవన్నలు చిత్రానికి చాలా ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఇంత‌కీ ఆ గిత్త‌ల కేరాఫ్ అడ్ర‌స్ హైదరాబాదు శివారే... చౌటుప్పల్‌ మండలం లక్కారం గ్రామానికి చెందినవే. గ్రామానికి చెందిన నూనె శ్రీనివాస్‌ స్థానికంగా తన వ్యవసాయ క్షేత్రంలో గోశాలను ఏర్పాటు చేశాడు. ప్రత్యేకమైన ఆవులు, కోడెలను పెంచుకుంటున్నాడు. అందులో భాగంగా రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన కోడెలకు కృష్ణుడు, అర్జునుడు అనే పేర్లు పెట్టాడు. నిత్యం వాటికి వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చాడు. పేరు పెట్టి పిలిస్తే పలికేలా, చెప్పిన మాట వినేలా తయారు చేశాడు.

 
ఆ క్రమంలో సొంత పని నిమిత్తం శ్రీనివాస్‌ గతేడాది రామోజీ ఫిలిం సిటీకి వెళ్లాడు. అక్కడ షూటింగ్‌ జరుగుతుండడంతో ఎద్దుల చర్చ వచ్చింది. దాంతో తన కోడెలకు సంబంధించిన వీడియోలు చూపించాడు. కోడెల నైపుణ్యం నచ్చిన నిర్వాహకులు షూటింగ్‌కు ఆహ్వానించారు. ఆ  మేరకు ఏడాది క్రితం రామోజీ ఫిలింసిటీలో రెండ్రోజుల పాటు కోడెలు షూటింగ్‌లో పాల్గొన్నాయి. చిత్రంలోని ప్రారంభ సన్నివేశంతో పాటు క్లైమాక్స్‌ సన్నివేశంలో ఇవి కన్పిస్తాయి.


మూగజీవాలైనప్పటికీ సినిమా షూటింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి సినిమాకే వన్నె తెచ్చాయి. ప్రముఖ హీరోతో కలిసి ప్రధానమైన సీన్ల‌లో, సినిమాలో తన కోడెలు నటించడం, చక్కటి గుర్తింపు రావడం ఆనందంగా ఉందని శ్రీనివాస్‌ తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments