Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ కన్నుగీటాడు... చాలా ఆనందంగా ఉందన్న ప్రియా వారియర్

ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుపై లోక్‌సభలో శుక్రవారం జరిగిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభలో కన్నుగీటిన అంశం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రధాని మోడీతో ఆ

Webdunia
శనివారం, 21 జులై 2018 (11:33 IST)
ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుపై లోక్‌సభలో శుక్రవారం జరిగిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభలో కన్నుగీటిన అంశం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రధాని మోడీతో ఆలింగనం చేసుకున్న తర్వాత రాహుల్ తన సీటులో ఆశీనులై తమ పార్టీకి చెందిన సభ్యుడిని చూస్తూ కన్నుగీటారు. దీనిపై మలయాళ హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ స్పందించారు.
 
లోక్‌సభలో కన్నుగీటిన రాహుల్‌ గాంధీని ప్రియా ప్రకాశ్‌ వారియర్‌తో పోల్చుతూ నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. దీంతో ప్రియా వారియర్ స్పందిస్తున్నారు. 'నేను కాలేజీ నుంచి ఇంటికి వచ్చి రాహుల్‌ గాంధీ ప్రధానిని చూసి కన్నుగీటిన వార్త చూశాను. ఇదో మధురమైన సంకేతం. నేను నటించిన తొలి చిత్రంలో ఇలా కన్నుగొట్టే దృశ్యం నాకెంతో ప్రత్యేకమైనది. కాబట్టి ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను' అని ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 
 
అలాగే, సోషల్ మీడియాలో పేలుతున్న జోకులను పరిశీలిస్తే, రాహుల్‌ ఆలింగనం, కన్నుకొట్టడంపై సోషల్‌ మీడియా మెరుపు వేగంతో స్పందించింది. 'కన్నుకొట్టుడు' వీడియోతో బాగా పాపులర్‌ అయిన ప్రియాప్రకాశ్‌ వారియర్‌ ఫొటోతో కలిపి తెగ షేర్లు చేస్తున్నారు. 
 
ఇద్దరిలో ఎవరు బాగా కన్నుకొట్టారు? అంటూ ఒక నెటిజన్‌ ప్రశ్నించగా.. 'రాహుల్‌ మున్నాభాయ్‌ను గుర్తుచేశాడు' అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. 'పప్పుకీఝప్పీ (పప్పు కౌగిలింత)', 'హగ్‌ప్లొమసీ' అనే హ్యాష్‌ట్యాగ్‌లతో వందలు వేల ట్వీట్లు పోస్ట్‌ అయ్యాయి. 
 
పనిలోపనిగా.. విదేశీ పర్యటనల్లో ఆయా దేశాల నేతలను కౌగిలించుకునే మోడీకి ఆలింగనం రుచి రాహుల్‌ చూపారంటూ ప్రధానికీ చురకలంటించారు కొందరు. వాటిలో మచ్చుకు కొన్ని.. ప్రియావారియర్‌.. ఇంక బయల్దేరు! నీకు రాహుల్‌ గాంధీ నుంచి గట్టి పోటీ వస్తోంది!!

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments