Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్స్యకన్యతో యోగా గురువు బాబా రామ్‌దేవ్‌...

బాలీవుడ్ సీనియ‌ర్ హీరో గోవిందా గ‌త కొంత‌కాలంగా నిరంత‌రం వార్త‌ల్లోకొస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న రీఎంట్రీ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వివాదాస్ప‌ద బిజినెస్‌మేన్, కింగ్‌ఫిష‌ర్ విజ‌య్ మాల్యా పాత్

Webdunia
శనివారం, 21 జులై 2018 (10:48 IST)
బాలీవుడ్ సీనియ‌ర్ హీరో గోవిందా గ‌త కొంత‌కాలంగా నిరంత‌రం వార్త‌ల్లోకొస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న రీఎంట్రీ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వివాదాస్ప‌ద బిజినెస్‌మేన్, కింగ్‌ఫిష‌ర్ విజ‌య్ మాల్యా పాత్ర‌లో న‌టిస్తున్న గోవిందా, యోగా గురూ రామ్‌దేవ్ బాబాజీ పాత్ర‌లోనూ అభిన‌యిస్తున్నారు.
 
ప్ర‌స్తుతం గోవిందాపై చిత్రీక‌ర‌ణ సాగుతోంది. ఇందులోభాగంగా బాబా రామ్‌దేవ్ - శిల్పాశెట్టి పై ఓ పాటను చిత్రీక‌రిస్తున్నారు. యోగా గురూ రామ్‌దేవ్ పాత్ర‌లో గోవిందా, శిల్పాశెట్టి పాత్ర‌లో అనుప‌మ అగ్నిహోత్రి న‌టిస్తున్నారు. ఈ జంట‌పై చిత్రీక‌రిస్తున్న పాట సినిమాలో ఎంతో ఫ‌న్నీగా ఉంటుందిట‌. 
 
సీబీఎఫ్‌సీ మాజీ ఛీఫ్ ప్ర‌హ్లాద్ నిహ‌లానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌న‌దైన అభిన‌యం, ఆహార్యంతో అద్భుత‌మైన కామెడీని పండించ‌గ‌ల మేటి క‌థానాయ‌కుడిగా గోవిందా సుప‌రిచితం. అత‌డికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. ప్ర‌స్తుతం అత‌డు చేస్తున్న ఈ రెండు పాత్ర‌ల గురించి ఫ్యాన్స్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. రీఎంట్రీలో గోవిందా అద‌ర‌గొట్టేయ‌డం ఖాయ‌మంటూ ఆయన అభిమానులు ఘంటాపథంగా చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments