Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అబ్బ... రాహుల్ గాంధీ... పప్పు కాదు... ఒప్పు, విరగదీశాడనుకో....(ఫోటోలు)

లోక్ సభలో ఈరోజు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం, ప్రవర్తించిన తీరుకు భాజపా అగ్రనాయకులకు దిమ్మతిరిగిపోయింది. అసలు ఊహించని రీతిలో స్పందించారు రాహుల్ గాంధీ. ఆయన మాట్లాడుతూ... నన్ను ఏమని విమర్శించినా నాకు కోపం లేదు, నా మనసులో ఏలాంటి బాధ లేదు. నన్ను “పప్పు” అన

Advertiesment
అబ్బ... రాహుల్ గాంధీ... పప్పు కాదు... ఒప్పు, విరగదీశాడనుకో....(ఫోటోలు)
, శుక్రవారం, 20 జులై 2018 (15:54 IST)
లోక్ సభలో ఈరోజు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం, ప్రవర్తించిన తీరుకు భాజపా అగ్రనాయకులకు దిమ్మతిరిగిపోయింది. అసలు ఊహించని రీతిలో స్పందించారు రాహుల్ గాంధీ. ఆయన మాట్లాడుతూ... నన్ను ఏమని విమర్శించినా నాకు కోపం లేదు, నా మనసులో ఏలాంటి బాధ లేదు. నన్ను “పప్పు” అన్నప్పటికీ నాకెలాంటి కోపం లేదు.
 
నేను మాత్రం ప్రేమనే పంచుతాను, మీ మనసు పొరలలో, అంతరంతరాళలలో దాగి ఉన్న ప్రేమను కూడా బయట తీసుకొస్తానని బిజేపి సభ్యులనుద్దేశించి వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీ.... నేరుగా ప్రధాని కూర్చున్న చోటికి వెళ్లి నమస్కరించి, కౌగిలించుకుని అభినందనలు తెలిపారు.
webdunia
 
ఊహించని ఈ పరిణామానికి నిశ్చేష్టులయ్యారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. రెప్పపాటులో తేరుకున్న ప్రధానమంత్రి... తిరిగి తన స్థానానికి వెళుతున్న రాహుల్ గాంధీని పిలిచి మరీ చేయి కలిపారు. బిజేపి, ఆర్.ఎస్.ఎస్ నుంచి అసలైన “హిందు” అర్థం ఏమిటో నేర్చుకున్నాను, తెలుసుకున్నాను అంటూ చేసిన రాహుల్ గాంధీ ప్రసంగం ఆసాంతం ఆకట్టుకున్నది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకే మగాడి బుట్టలో పడ్డ ముగ్గురు అక్కాచెల్లెళ్లు... నమ్మించి తీస్కెళ్లి?