Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒకే మగాడి బుట్టలో పడ్డ ముగ్గురు అక్కాచెల్లెళ్లు... నమ్మించి తీస్కెళ్లి?

దేశంలో అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయంటూ ఒక సర్వే తెలిపింది. ఏకంగా రెండు సంవత్సరాల్లో లక్షన్నరకుపైగా అత్యాచారాలు జరిగినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. నమోదైన కేసులు ఇన్ని అయితే నమోదు కాని కేసులు ఇంకెన్నో. మహిళలు, యువతపై అత్యాచారాలు ఈమధ్యకాలంలో మరిం

Advertiesment
ఒకే మగాడి బుట్టలో పడ్డ ముగ్గురు అక్కాచెల్లెళ్లు... నమ్మించి తీస్కెళ్లి?
, శుక్రవారం, 20 జులై 2018 (15:13 IST)
దేశంలో అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయంటూ ఒక సర్వే తెలిపింది. ఏకంగా రెండు సంవత్సరాల్లో లక్షన్నరకుపైగా అత్యాచారాలు జరిగినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. నమోదైన కేసులు ఇన్ని అయితే నమోదు కాని కేసులు ఇంకెన్నో. మహిళలు, యువతపై అత్యాచారాలు ఈమధ్యకాలంలో మరింత పెరిగిపోవడానికి మగవాళ్లు మృగాళ్ళుగా మారిపోతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. 
 
కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మైసూరులోని ఉదయగిరికి చెందిన ఒక పేద కుటుంబంలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి వయస్సు 18 యేళ్ళు, రెండవ అమ్మాయికి 17 యేళ్ళు, మూడవ అమ్మాయి 16 యేళ్ళు. ముగ్గురు అక్కాచెల్లెల్లు. తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్న వీరి కుటుంబానికి ఇంటి ఎదురుగా ఉన్న ఒక యువకుడు పరిచయమయ్యాడు.
 
ముగ్గురు అమ్మాయిలకు డబ్బులను చూపించి ప్రలోభపెట్టాడు. ముగ్గురిని లోబరుచుకున్నాడు. అంతటితో ఆగలేదు. ముగ్గురు అమ్మాయిలను తీసుకుని రెండు నెలల పాటు బయటకు తీసుకెళ్ళిపోయాడు. తనకు తెలిసిన కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ముగ్గురు అమ్మాయిలతో వ్యభిచారం చేయించాడు. అలా ఐదుగురు టీంగా ఏర్పడి బలవంతంగా వ్యభిచారం చేయించారు. నమ్మి అతనితో వచ్చినందుకు మోసపోయామని తెలుసుకున్న అమ్మాయిలు పోలీసులు ఆశ్రయించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని యువతులను తల్లిదండ్రులను అప్పగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధానికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్న రాహుల్- హాట్ అండ్ కోల్డ్ అటాక్