Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోదీని అంత మాట అంటావా? గల్లాపై మండిపడిన నిర్మలా సీతారామన్

పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అవిశ్వాసంపై చర్చను ప్రారంభిస్తూ.. ఏపీకి చేసిన అన్యాయంపై గల్ల జయదేవ్ కేంద్రాన్ని ఎండగట్టారు. తన సుదీర్ఘ ప్రసంగంలో నరేంద్ర మోదీ

Advertiesment
మోదీని అంత మాట అంటావా? గల్లాపై మండిపడిన నిర్మలా సీతారామన్
, శుక్రవారం, 20 జులై 2018 (13:14 IST)
పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అవిశ్వాసంపై చర్చను ప్రారంభిస్తూ.. ఏపీకి చేసిన అన్యాయంపై గల్ల జయదేవ్ కేంద్రాన్ని ఎండగట్టారు. తన సుదీర్ఘ ప్రసంగంలో నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఓ దశలో మోదీని ''మోసగాడు'' అని సంబోధించడంపై కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ విరుచుకుపడ్డారు. గౌరవనీయ పదవిలో ఉన్న ప్రధానిని మోసగాడని అనడం సరైంది కాదన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌కు ఏం చేశామో తమకు తెలుసునని.. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మరిచిపోయిందన్నారు. వెంటనే 'మోసగాడు' అన్న పదాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో స్పందించిన స్పీకర్ సుమిత్రా మహాజన్, అటువంటి అభ్యంతరకర పదాలు రికార్డులో ఉంటే తొలగిస్తామని చెప్పారు.
 
అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ని అడ్డగోలుగా విభజించారంటూ లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా, అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన జరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో గల్లా వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, లోక్‌సభ, రాజ్యసభలలో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిందని చెప్పారు.
 
తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ఆత్మబలిదానాలకు పాల్పడ్డారని... ఈ నేపథ్యంలో రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీని, బీజేపీని తాము ఒప్పించామని, తదనంతరం పార్లమెంటు ఉభయసభల్లో బిల్లు పాస్ అయిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా, అశాస్త్రీయంగా జరిగిందని ఎలా అంటారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్‌తో కలిసి అవిశ్వాసమా..? గల్లాగారూ మీరూ శాపగ్రస్థులైయ్యారు: రాకేష్ సింగ్