Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు దేశానికి ఎజెండా ఫిక్స్... మోడీకి అగ్ని పరీక్ష... డొక్కా వ్యాఖ్య

అమరావతి: దేశ రాజకీయాల్లో రేపు అరుదైన సంఘటన జరుగబోతోందని, ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అగ్ని పరీక్ష అని ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చం

చంద్రబాబు దేశానికి ఎజెండా ఫిక్స్... మోడీకి అగ్ని పరీక్ష... డొక్కా వ్యాఖ్య
, గురువారం, 19 జులై 2018 (15:56 IST)
అమరావతి: దేశ రాజకీయాల్లో రేపు అరుదైన సంఘటన జరుగబోతోందని, ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అగ్ని పరీక్ష అని ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశానికి ఎజండా ఫిక్స్ చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రేపు చర్చ జరుగబోతుందని చెప్పారు. పార్లమెంటు చట్టంపై మోడీకి గౌరవం ఉందో లేదో, దానిని అమలు చేస్తారో లేదో ఇప్పుడు తెలుస్తుందన్నారు. 
 
పార్లమెంటు చేసిన విభజన చట్టాన్ని మోడీ ప్రభుత్వం అమలు చేస్తుందని 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎదురుచూశారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో హామీలు అమలు చేయించుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు 29 సార్లు ఢిల్లీ వెళ్లారన్నారు. వారు హామీలు అమలు చేయనందున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవలసి వచ్చిందని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్ కోసం అందరూ కలసిన రావలసిన సమయం ఇదన్నారు. 
 
రాజకీయాలకు అతీతంగా అందరి మద్దతు కూడగట్టవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ టీడీపీని టార్గెట్ చేయడం దురుదృష్టకరం అన్నారు. విభజన చట్టం అమలు చేసి పార్లమెంటుపై గౌరవం పెంచవలసిన అవసరం ఉందని చెప్పారు. హామీలు అమలు చేస్తే కేంద్రానికి, మోడీకి మంచిదన్నారు. ప్రజాస్వామ్యంపై గౌరవం పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారు సంతోషిస్తారని చెప్పారు. మాయ మాటలు చెబితే ప్రజలు నమ్మరన్నారు.
 
దేశవ్యాప్తంగా బీజేపీ హింసాత్మక సంఘటనలకు పాల్పడుతుందని విమర్శించారు. పాద యాత్రలకంటే పార్లమెంటు పవిత్రమైనదని వైసీపీ గుర్తించాలన్నారు. లోక్ సభలో వైసీపీ వారు ఉంటే ఇప్పుడు అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో పాల్గొనేవారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వారు ఆ అవకాశం కోల్పోయారన్నారు. పాదయాత్ర, ఓదార్పు యాత్రల కంటే పార్లమెంటు పవిత్రమైనదని చెప్పారు. అవిశ్వాసానికి అందరి మద్దతు కావాలని, ఇంతకుముందు మద్దతు తెలుపుతామని ప్రకటించినవారు కూడా ముందుకు రావాలని డొక్కా విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పల్టీకొట్టిన శివసేన - అన్నాడీఎంకే.. అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు