Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవిశ్వాసంలో గెలుపుమాదే.. కేంద్రం విశ్వాసం.. ఇదీ సంఖ్యాబలం..

విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని, విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని లోక్‌సభ స్పీ

Advertiesment
no-confidence motion
, గురువారం, 19 జులై 2018 (09:45 IST)
విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని, విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. దీంతో శుక్రవారం అవిశ్వాసంపై చర్చజరుగనుంది.
 
అయితే అవిశ్వాస తీర్మానంపై కేంద్రం ధీమా వ్యక్తం చేస్తోంది. విపక్షాలకు అవిశ్వాస తీర్మానం పెట్టే అధికారం ఉందన్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్ రాజ్ గంగారాం ఆహిర్... ప్రధాని నరేంద్ర మోడీ మొదలు ప్రతీ బీజేపీ ఎంపీ అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 
 
అవిశ్వాసంపై ఆందోళన చెందాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేసిన హన్స్‌రాజ్... ప్రధాని నరేంద్ర మోడీని దేశం విశ్వసిస్తోందన్నారు. పార్లమెంట్ కూడా ప్రధాని‌పట్ల విశ్వాసం ప్రకటిస్తుందని నమ్మకాన్ని వెలిబుచ్చిన ఆయన... ప్రధానికి దేశప్రజల ఆశీర్వాదం ఉందన్నారు. అందువల్ల అవిశ్వాసంలో తమదే అంతిమ విజయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
కాగా, ప్రస్తుత సభలో బీజేపీకి 273 మంది సభ్యులు ఉంటే ఎన్డీయే కూటమిలోని భాగస్వామి పార్టీలైన శివసేనకు 18, లోక్‌జనశక్తికి 6, శిరోమణి అకాలీదళ్‌కు 4, ఆర్ఎల్‌ఎస్పీకి 3, అప్నాదళ్‌కు 3, జేడీయూకు 2, సిక్కిం డెమొక్రటిక్ 1 చొప్పున మొత్తం 310 మంది సభ్యుల మద్దతు ఉంది. అలాగే, అన్నాడీఎంకేకు 37 మంది సభ్యుల మద్దతు ఉంది. వీరంతా కూడా మోడీ సర్కారుకు బాసటగా నిలిస్తే ఎన్డీయే సర్కారు బలం 347కు చేరుకుంది. 
 
ఇకపోతే, అవిశ్వాసానికి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ తరపున 16 మంది సభ్యులు ఉంటే, కాంగ్రెస్‌కు 48, టీఎంసీకి 34కు, సీపీఎంకు 9, ఎన్సీపీకి 7, ఎస్పీకి 7, ఆమ్ ఆద్మీ పార్టీకి 4, ఆర్జేడీకి 4, ఏఐయూడీఎఫ్‌కు 3, ఐఎన్‌ఎల్‌డి, ఐయూఎంఎల్‌కు, జేఎంఎంకు ఇద్దరేసి సభ్యులు, ఎంఐఎం, ఎన్.ఆర్ కాంగ్రెస్, సీపీఐ, జే అండ్ కేఎన్సీకి ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. వీరితో పాటు.. జేడీఎస్, కేరళ కాంగ్రెస్, ఎన్.పీపీ. ఎన్డీపీ, పీఎంకే, ఆర్ఎల్డీ, ఆర్ఎన్పీ, స్వాభిమాన్‌పక్ష పార్టీలకు ఒక్కరేసి చొప్పున సభ్యులు ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేప్‌కు మరణదండన... బిల్లుపెట్టనున్న కేంద్రం