Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భరత్ అనే నేను.. అనే స్టోరీలైన్‌తో చర్చను ప్రారంభించిన గల్లా జయదేవ్

అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించిన గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. భరత్ అనే నేను స్టోరీ‌ లైన్‌తో అవిశ్వాసంపై చర్చ మొదలెట్టారు. ఏపీ ధర్మ పోరాటం చేస్తోందన్నారు. ఇది సంఖ్యాబలానికి, నైతికతకు మధ్య జరుగుతున్

Advertiesment
Galla Jayadev
, శుక్రవారం, 20 జులై 2018 (11:21 IST)
పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చను ఎంపీ గల్లా జయదేవ్ ప్రారంభించారు. ఇప్పటికే లోక్‌సభలో అవిశ్వాస సమరానికి అధికార, విపక్షాలు సిద్ధమయ్యాయి. మాటల కత్తులు దూసుకోవడానికి వ్యూహాలకు పదును పెట్టుకున్నాయి.


విభజన చట్టపరంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ అమలులో విఫలమైన కేంద్ర ప్రభుత్వ వైఖరిని దేశవ్యాప్తంగా అందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతో తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ ప్రారంభం కానుంది. 
 
ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే సభనుంచి బీజేడీ వాకౌట్ చేసింది. 14 ఏళ్లుగా ఒడిస్సాకు తీవ్ర అన్యాయం జరిగిందని బీజేడీ ఎంపీ తెలిపారు. సభలో అవిశ్వాసంపై చర్చను వన్డే క్రికెట్‌తో అనంతకుమార్ పోల్చారు. ఇంకా అవిశ్వాసంపై చర్చకు గాను పార్టీలకు టైమ్ లిమిట్ పెట్టకండని మల్లికార్జున ఖర్గే కోరారు. 
 
ఇక అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించిన గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. భరత్ అనే నేను స్టోరీ‌ లైన్‌తో అవిశ్వాసంపై చర్చ మొదలెట్టారు. ఏపీ ధర్మ పోరాటం చేస్తోందన్నారు. ఇది సంఖ్యాబలానికి, నైతికతకు మధ్య జరుగుతున్న పోరాటం అన్నారు. అపనమ్మకం, ప్రాధాన్యం ఇవ్వకపోవడం, న్యాయమైన డిమాండ్లు, ధర్మపోరాటం అనే నాలుగు అంశాలపై ఏపీ అవిశ్వాసం పెట్టిందని గల్లా జయదేవ్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుదుచ్చేరిలో ఘోరం- 17ఏళ్ల బాలికపై ఏడుగురు వ్యక్తుల అత్యాచారం..