Webdunia - Bharat's app for daily news and videos

Install App

48 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేం .. కృష్ణ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (14:44 IST)
సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంపై హైదరాబాద్ నగరంలోని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు సోమవారం మధ్యాహ్నం ఒక హెల్త్ బులిటెన్‌ను రిలీజ్ చేశారు. మరో 48 గంటలు గడిస్తేగానీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఓ క్లారిటీ ఇవ్వలేమని చెప్పారు. ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో కృష్ణ ఆరోగ్యం విషమంగానే ఉందని చెప్పారు. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత 1.15 గంటల సమయంలో కుటుంబ సభ్యులు కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చారని తెలిపారు. 
 
"రాత్రి 1.15 గంటల సమయంలో కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చారు. కార్డియాక్ అరెస్ట్ పరిస్థితి ఉండటంతో వెంటనే ఎమర్జెన్సీకి తరలించి సీపీఆర్ చేశాం. 20 నిమిషాల తర్వాత కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయనను ఐసీయూ వార్డుకు తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. మెరుగైన వైద్యం అందిస్తున్నాం. రేపు మధ్యాహ్నం మరోమారు మీడియాకు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తాం. మరో 48 గంటల వరకు కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేం" అని వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments