Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ‌న్సిక 105 మినిట్స్- షూటింగ్ ప్రారంభం

Webdunia
బుధవారం, 21 జులై 2021 (14:00 IST)
Hansika 105 min.
''కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాను. చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఈ టీమ్ కి ఆల్ ది బెస్ట్'' అంటూ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేశారు బబ్లీ గర్ల్ హన్సిక. ఇంతలా తను ఎగ్జయిట్ అవ్వడానికి కారణం ప్రస్తుతం హన్సిక చేస్తున్న తాజా చిత్రం '105 మినిట్స్'.
 
ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో తెరకెక్కుతోన్న చిత్రం "105 మినిట్స్". షూటింగ్ స్పాట్ లోనే ఎడిటర్ శ్యామ్ పర్యవేక్షిస్తున్నారు. ''సింగిల్ షాట్"  "సింగిల్ క్యారెక్టర్ "  "రీల్ టైం & రియల్ టైం " ఈ చిత్రానికి హైలైట్స్. 
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలోని ఓ విల్లాలో జరుగుతోంది. ఈ షూటింగ్ లో జాయిన్ అయిన హన్సిక పై విధంగా ట్వీట్ చేసారు.
 
రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో రాజు దుస్సా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సామ్ సి.యస్ సంగీతం సమకూర్చుతున్నారు. కిషోర్  బొయిదాపు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి యాక్షన్ డైరెక్టర్ మల్లి, పిఆర్ఓ రాజ్ కమల్.
సాంకేతిక వర్గం
నిర్మాత - బొమ్మక్ శివ, డైరెక్టర్ - రాజు దుస్సా, డిఓపి - కిషోర్ బొయిదాపు, మ్యూజిక్ - సామ్ సి.యస్,  ఆర్ట్ - బ్రహ్మ కడలి, చీఫ్ అసోసియేట్ - రూపాకిరణ్ గంజి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments