Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగ్‌లో గాయపడిన హీరో విశాల్

Webdunia
బుధవారం, 21 జులై 2021 (13:41 IST)
కోలీవుడ్ హీరో  విశాల్ మరోమారు షూటింగులో గాయపడ్డారు. ప్ర‌స్తుతం ఆయన ‘నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌’ సినిమాలో న‌టిస్తున్నాడు. తూపా.శరవణన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జ‌రుగుతోంది. 
 
యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తోన్న స‌మ‌యంలో ఆయ‌న‌ గోడను ఢీకొని ప‌డిపోవ‌డంతో తీవ్ర గాయమైంది. దీంతో విశాల్‌ వెన్ను భాగానికి దెబ్బతగిలింది. ఆయ‌న‌కు వెంట‌నే వైద్యులు చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉంద‌ని సినిమా బృందం తెలిపింది. 
 
ఇదే సినిమా షూటింగ్‌లో గ‌తంలోనూ విశాల్ గాయాల‌పాల‌య్యాడు. అప్ప‌ట్లో ఆయ‌న తల, కంటికి స్వల్ప గాయాల‌య్యాయి. ఆ ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే ఆయ‌న మ‌రోసారి గాయాల‌పాలవ్వ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమాక్స్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments