#RRR మేనియా ... రెండో సిలిండర్ కొనుగోలు చేస్తే సినిమా టిక్కెట్లు ఉచితం

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (21:37 IST)
ఈ నెల 25వ తేదీన "ఆర్ఆర్ఆర్" చిత్రం విడుదలకానుంది. రిలీజ్‌కు మరో వారం రోజులు ఉంది. అయితే, 'ఆర్ఆర్ఆర్' సందడి మాత్రం అపుడే మొదలైంది. ఇటీవల ఈ చిత్రంలోని "ఎత్తర జెండా" పాటను రిలీజ్ చేసిన చిత్ర బృందం మరోమారు భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశ వ్యాప్తంగా "ఆర్ఆర్ఆర్" మేనియా మొదలైంది. 
 
దీనికి నిదర్శనమే గుంటూరు జిల్లాలో ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ యజమాని ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించారు. సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారులు రెండో సిలిండర్ కొనుగోలు చేస్తే "ఆర్ఆర్ఆర్" మూవీ టిక్కెట్లను ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు. అదీ కూడా సినిమా రిలీజ్ రోజున ఇంటికి వచ్చిన మరీ టిక్కెట్లు అందజేస్తామని ప్రకటించారు. 
 
ఈ గ్యాస్ ఏజెన్సీ గతంలో "బాహుబలి-2" చిత్రం సమయంలోనూ ఇలాగే ఫ్రీ టిక్కెట్లు ప్రకటించింది. తాజాగా ప్రకటన చేసిన కాసేపటికే మూడు సిలిండర్లు బుక్ అయినట్టు గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి వెల్లడించారు. ఈ సినిమా టిక్కెట్లను దుగ్గిరాల సరోజిని థియేటర్‌లో సినిమా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

నిద్రపోతున్నప్పుడు భారీ వస్తువుతో దాడి.. టైల్ కార్మికుడు హత్య.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments