రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ నెల 25వ తేదీన విడుదలకానుంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించి సినిమా టిక్కెట్ ధరలను పెంచుకునే అవకాశం ఉన్నట్టు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తెలిపారు.
ఇదే అంశంపై ఆయన గురువారం మాట్లాడుతూ, భారీ బడ్జెట్ సినిమా విడుదలైన 10 రోజుల పాటు సినిమా టిక్కెట్ ధరలు పెంచుకోవచ్చని అన్నారు. సాధారణ ప్రజలకు భారం పడకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.
మరోవైపు, ఆన్‌లైన్ టిక్కెట్ విధానానికి టెండర్లు ఖరారయ్యాయని చెప్పారు. ఇందులో రెండు కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
కాగా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియ వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రాన్ని రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య తన సొంత బ్యానర్ డీవీవీ సినిమాస్‌పై నిర్మించిన విషయం తెల్సిందే.