Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాశ, భయం, కుట్ర అనేవి నన్ను అట్రాక్ట్ చేశాయి : ఆనంద్ దేవరకొండ

డీవీ
బుధవారం, 29 మే 2024 (17:41 IST)
Anand Devarakonda
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "గం..గం..గణేశా". ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. "గం..గం..గణేశా" ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. తాజా ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు హీరో ఆనంద్ దేవరకొండ
 
- మిడిల్ క్లాస్ మెలొడీస్ తర్వాత లాక్ డౌన్ పడింది. ఆ లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. అసలు అది పూర్తిగా వెళ్లిపోతుందో లేదో కూడా అర్థం కాలేదు. అలాంటి టైమ్ లో నా నెక్ట్ మూవీ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే ఆలోచన మొదలైంది. బేబి  కథతో పాటు "గం..గం..గణేశా" స్క్రిప్ట్ కూడా నా దగ్గరకు వచ్చింది. దర్శకుడు ఉదయ్ శెట్టి పంపిన స్క్రిప్ట్ సినాప్సిస్ లో అత్యాశ, భయం, కుట్ర అనే మూడు పదాలు నన్ను అట్రాక్ట్ చేశాయి. ఈ లైన్ ఎగ్జైట్ చేసింది. యూనిక్ గా అనిపించింది. ఎందుకంటే నాకు స్వామి రారా వంటి క్రైమ్ కామెడీస్ చూడటం ఇష్టం. ఆ సినిమా చూసినప్పుడు మన తెలుగులో ఇలాంటివి ఇంకా మరికొన్ని సినిమాలు చేయొచ్చు కదా అనిపించేది.
 
- "గం..గం..గణేశా" ఒప్పుకున్న తర్వాత షూటింగ్ డిలే అయ్యింది. నేను బేబి మూవీ కోసం ఆ క్యారెక్టర్ మేకోవర్ లో ఉండిపోయాను. అందులో నుంచి బయటకు వచ్చేందుకు కొన్ని నెలల టైమ్ పట్టింది. కోవిడ్ సెకండ్ వేవ్, ఫిల్మ్ యూనియన్ స్ట్రైక్స్ జరగడం..ఇలాంటి వాటి వల్ల డిలేస్ అవుతూ వచ్చాయి. సెకండాఫ్ లో వినాయకుడి మండపం నేపథ్యంలో సీన్స్ ఉంటాయి. వాటికోసం ఒక సెట్ వేశాం. భారీ వర్షాలకు ఆ సెట్ పడిపోయింది. మళ్లీ ఆ సెట్ ను పునర్నిర్మించి షూటింగ్ చేశాం. దానికి కొంత టైమ్ పట్టింది.
 
- ప్రతి ఇంటర్వ్యూలో మీరు హీరో సెంట్రిక్ మూవీస్ ఎందుకు చేయరు అని అడుగుతుంటారు. ఎందుకు చేయకూడదు అని నాకూ అనిపించింది. "గం..గం..గణేశా" కథతో ఆ ప్రయత్నం చేయొచ్చనే నమ్మకం కలిగింది. నేను గతంలో కనిపించినట్లు ఇందులో పక్కింటి కుర్రాడిలా కనిపించను. ఎనర్జిటిక్ గా ఉంటా, కామెడీ చేస్తా, ఏడవాలనిపిస్తే ఏడుస్తా...హైపర్ గా ఉంటాను. తనను తాను హీరో అనుకుంటాడు గానీ హీరోలా ప్రవర్తించడు.
 
- నేను పెట్టుకున్న నమ్మకానికి తగినట్లు మా డైరెక్టర్ ఉదయ్ కథను అందరికీ నచ్చేలా స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు. కథలో ఒక పదిహేను కీలకమైన పాత్రలు ఉంటాయి. ఇంతమందితో పర్ ఫార్మ్ చేయించుకోవడంలో ఒక డెబ్యూ డైరెక్టర్ గా ఉదయ్ సక్సెస్ అయ్యాడు. అతనికి మరో రెండు మూడు సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. నేను "గం..గం..గణేశా" పట్ల హ్యాపీగా, కాన్ఫిడెంట్ గా ఉన్నాను.
 
- ఇటీవల ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ కోసం "గం..గం..గణేశా" స్పెషల్ షోస్ వేశాం. వాళ్లు సినిమా చూస్తున్నంత సేపు ఎంటర్ టైన్ అవుతూ ఎంజాయ్ చేశారు. వాళ్ల రెస్పాన్స్ చూసి మాకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది.  వందలసార్లు మేము షూటింగ్ ఫుటేజ్ చూస్తుంటాం అయినా కొత్తగానే అనిపించేది. సాధారణంగా ఈ యాక్షన్ కామెడీస్ థియేటర్ లో చూస్తేనే ఎంజాయ్ చేయగలరు. ఓటీటీలో ఆ కిక్ రాదు
 
- "గం..గం..గణేశా" కథ విన్నాక ఇందులోని కామెడీ టైమింగ్ నేను పర్పెక్ట్ గా చేయగలనా అని భయమేసింది. కొన్ని వర్క్ షాప్స్ చేశాం. ఎలాంటి టైమింగ్ ఉండాలో ఫిక్స్ చేసుకున్నాం. నేను గతంలో మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానంలో కూడా కామెడీ చేశా. అది నాచురల్ గా ఉంటుంది. "గం..గం..గణేశా"లో కొంచెం హైపర్ గా పర్ ఫార్మ్ చేయాల్సివచ్చింది.
 
- వినాయకుడి విగ్రహం చుట్టూ జరిగే కథ ఇది. ఆ విగ్రహం  దక్కించుకోవడం కోసం కొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్లంతా బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్నవాళ్లు. ఆ విగ్రహంలో అంత విలువైనది ఏముంది. ఎవరికి విగ్రహం దక్కింది అనేది కథాంశం. మనలోనూ భయం, అత్యాశ, కుట్ర అనే లక్షణాలు ఉంటాయి. అవి కొందరి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయి అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం.
 
- నేను పాటలు వింటూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటా. ఇంట్లో  ఖాలీగా ఉంటే అన్న విజయ్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయి అంటాడు. మా నాన్న కూడా నీలో గ్రేస్ ఉందిరా డ్యాన్స్ నేర్చుకో అనేవారు. బేబిలో ఓ ఆరు నిమిషాల పాట చేశాం. కానీ సినిమా నిడివికి ఎక్కువవుతుందని కట్ చేశాం. ఈ సినిమాలో డ్యాన్స్ లు చేసే అవకాశం దక్కింది.
 
- నా సినిమాల్లోనే కాదు అన్నయ్య విజయ్ చిత్రాల్లోనూ రిచ్ కంటెంట్ ఉంటుంది. క్యారెక్టర్ డ్రివైన్ మూవీస్ చేశాడు. అందుకే అర్జున్ రెడ్డి సినిమాతో ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. "గం..గం..గణేశా" నా ఇమేజ్ మార్చుకోవడం కోసం చేసిన సినిమా కాదు. కథ కొత్తగా అనిపించింది ఇలాంటి స్క్రిప్ట్, క్యారెక్టర్ ట్రై చేయొచ్చు కదా అనిపించి చేశా. మా సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక. ఇద్దరికీ మంచి పర్ ఫార్మెన్స్ చేసే స్కోప్ ఉంది. వాళ్లు బాగా నటించారు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా "గం..గం..గణేశా" ట్రయాంగిల్ లవ్ స్టోరి కాదు.
 
- హీరోగా నా మూవీస్ స్పాన్ ఒక్కసారిగా పెరిగేది కాదు. బేబితో వంద కోట్ల గ్రాసర్ అందుకున్నానని నా నెక్ట్ మూవీ అంతకంటే ఎక్కువ వసూళు చేయాలని అనుకోను. లవ్ సబ్జెక్ట్స్ యూనివర్సల్ కాబట్టి అంత రీచ్ వచ్చింది. మేము "గం..గం..గణేశా"కు ఆరేడు కోట్లు ఖర్చు పెట్టాం. ప్రమోషన్ అన్నీ కలుపుకుని పెట్టిన డబ్బులు తిరిగి వచ్చి బ్రేక్ ఈవెన్ అయ్యి, మీరంతా మంచి రివ్యూస్ ఇస్తే అదే మాకు ఎంతో స్ట్రెంత్, సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది. ఈ సమ్మర్ లో ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు రాలేదు. "గం..గం..గణేశా" ఆ కొరత తీర్చుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

బంగాళాఖాతంలో అల్పపీడనం... కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ప్రభాస్‌తో నాకు రిలేషన్ వున్నట్లు సైతాన్ సైన్యం చేత జగన్ ప్రచారం చేయించారు: షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments