Webdunia - Bharat's app for daily news and videos

Install App

''రంగస్థలం'' సక్సెస్ మీట్.. చీఫ్ గెస్టులుగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్

''రంగస్థలం'' సినిమా తాజాగా రూ.150కోట్ల గ్రాస్‌ను అధిగమించింది. తద్వారా తెలుగు సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో రంగస్థలం నాలుగో స్థానంలో నిలిచింది. విడుదలైన 11 రోజుల్లోనే ఈ సినిమా రూ.

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (10:25 IST)
''రంగస్థలం'' సినిమా తాజాగా రూ.150కోట్ల గ్రాస్‌ను అధిగమించింది. తద్వారా తెలుగు సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో రంగస్థలం నాలుగో స్థానంలో నిలిచింది. విడుదలైన 11 రోజుల్లోనే ఈ సినిమా  రూ.150 కోట్ల గ్రాసును సాధించడం విశేషం. ఓవర్సీస్‌లోను రంగస్థలం హవా కొనసాగుతోంది. నాన్నకు ప్రేమతో చేసిన సుకుమార్.. ఎన్టీఆర్‌కి అద్భుతమైన విజయాన్ని అందించాడు. 
 
ఇక గ్రామీణ నేపథ్యంలో 'రంగస్థలం' సినిమా చేసి చరణ్‌కి కూడా అనూహ్యమైన విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో రంగస్థలం సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో.. ఈ సినిమా సక్సెస్ మీట్‌కు సుక్కు రంగం సిద్ధం చేస్తున్నారు. భారీస్థాయిలో సక్సెస్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. అయితే రంగస్థలం సక్సెస్ మీట్ వేదిక ఎక్కడనేది ఆసక్తిగా మారింది. 
 
హైదరాబాద్-యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ వేడుకను జరపనున్నారనేది తాజా సమాచారం. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానుండటం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

ఏపీ అధికారులను అడుక్కోవడం ఏంటి? వాళ్లకు టీటీడీ వుంటే మనకు వైటీడీ ఉంది కదా? సీఎం రేవంత్

Christian pastors: క్రైస్తవ పాస్టర్లకు గౌరవ వేతనాల చెల్లింపు.. రూ.13కోట్లు విడుదల

Andhra Pradesh: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు.. బలమైన గాలులు, మెరుపులు.. ప్రజలకు ఊరట

Pawan Kalyan: చంద్రబాబు మరో 15 సంవత్సరాలు సీఎంగా పనిచేయాలి... పవన్ ఆకాంక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments