Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినీ ఛాన్సులు లేక పెయింటింగ్ పనులకెళ్లా : "రంగస్థలం" విలన్ అజయ్ ఘోష్

పెద్ద పెద్ద కళ్లతో.. నున్నని గుండుతో.. భారీ పర్సనాలిటీతో వెండితెరపై కనిపించే వ్యక్తి అజయ్ ఘోష్. సినిమాల్లో ఎక్కువగా పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తూ ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Advertiesment
సినీ ఛాన్సులు లేక పెయింటింగ్ పనులకెళ్లా :
, బుధవారం, 11 ఏప్రియల్ 2018 (16:18 IST)
పెద్ద పెద్ద కళ్లతో.. నున్నని గుండుతో.. భారీ పర్సనాలిటీతో వెండితెరపై కనిపించే వ్యక్తి అజయ్ ఘోష్. సినిమాల్లో ఎక్కువగా పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తూ ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం 'రంగస్థలం'. ఇందులో ఆయన వేసిన పాత్రకి మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలో జరిగిన అనేక సంఘటనలను వెల్లడించారు. 
 
'సినిమా రంగంలో రాణించాలనే పట్టుదలతో ఇక్కడికి వచ్చి ఎంతమంది ఎన్ని రకాలుగా కష్టపడుతున్నారో నాకు తెలుసు అలాంటి వారిలో తాను ఒకడిని' అని చెప్పారు. కృష్ణా నగర్‌లో నివసించే వారిలో ఎవరిని కదిలించినా భయంకరమైన సంఘటనలు బయటికి వస్తాయి. అవకాశాలు రాక .. ఆకలికి తట్టుకోలేక నానా అవస్థలు పడుతుంటారు. అట్లా నేను పడిన బాధలు.. అవమానాలు ఎన్నో వున్నాయి.. ఎన్నని చెప్పమంటారు?' అని ప్రశ్నించారు. 
 
సినీ అవకాశాలు లేనిసమయాల్లో యూసఫ్‌గూడా అడ్డా నుంచి మాదాపూర్‌కి కూలి పనికి వెళ్లేవాడిని. ఏదో ఒకటి తేల్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను కాబట్టి .. అవన్నీ నాకు పెద్ద కష్టాలుగా అనిపించలేదన్నారు. ముఖ్యంగా, పెయింటింగ్స్ పనులకు కూడా వెళ్లినట్టు తెలిపారు. అలాగే, 'నాకు విలన్ పాత్రలు చేయడం ఇష్టం.. విలనిజంలోను ఎన్నో విభిన్నమైన లక్షణాలు ఉంటాయన్నారు. 
 
అందువల్లనే సమాజంలోని వివిధ రకాల మనుషులను చాలా దగ్గరగా పరిశీలిస్తూ వుంటాను. ఆయా వ్యక్తులు.. వాళ్ల చిత్రమైన ధోరణి నుంచి విలన్‌గా నా నటనకి కావలసిన కంటెంట్‌ను తీసుకుంటాను. విలన్ పాత్రలకి సంబంధించి నేను స్ఫూర్తిని పొందడానికి ఎస్వీఆర్ నుంచి కోట శ్రీనివాసరావుగారు వరకూ కారకులే. అలాంటి మహానటుల నీడలో నిలబడే చోటు దొరికినా చాలనేది నా కోరిక' అని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దగ్గడానికి ఓపిక పెరుగుతుంది అనీ