Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున రెండో కోడల్ని పరిచయం చేసారా? మరీ అంత బరి తెగిస్తారా?

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (12:45 IST)
ఇదివరకు గాసిప్స్ అనేవి నటీనటులు సైతం వాటిని చదువుకుని నవ్వుకునే పరిస్థితి వుండేదని చాలామంది తారలు చెప్తుంటారు. గాసిప్స్ కూడా వారి కెరీర్‌కి కానీ వ్యక్తిగత ప్రతిష్టను కానీ దెబ్బతీసేవిగా వుండేవి కాదు. ఎవరో కొందరు నూటికి ఒక్కరు అవాస్తవమైన విషయాలను రాసి రాక్షసానందం పొందేవారని టాలీవుడ్ సెలబ్రిటీలే చెపుతున్నారు.

 
తాజాగా ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. అదేంటంటే... నాగార్జున తన కుమారుడు నాగచైతన్యకి పిల్లని చూసాడనీ, పరిచయం కూడా చేసారని రాసేస్తున్నారు. ఇక నాగచైతన్య విడాకులకు కారణాలు అవీఇవీ అంటూ ఎవరికితోచినట్లు వారు రాసేస్తున్నారు.

 
విడాకుల వ్యవహారం సందర్భంలోనే తమ వ్యక్తిగత జీవితం గురించి ఇకపై రాయొద్దు అని ఇరువురు సందేశాలు పంపారు. కానీ కొంతమంది మాత్రం వారిని వదిలిపెట్టడంలేదు. ఒకరికి మించి మరొకరు గాలి వార్తలు రాస్తూ అయోమయం సృష్టిస్తున్నారు. దీనిపై అక్కినేని ఫ్యామిలీ ఎప్పుడో తేల్చి చెప్పింది.

 
ఇటీవలి కాలంలో అవాస్తవ వార్తలు రాసే జబ్బుతో కొందరు బాధపడుతున్నారని, అలాంటివారు వండివార్చే వార్తలను పట్టించుకునేంత తీరిక లేదని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అంత మాటన్నాక కూడా అవాస్తవాలు రాసేవారిని ఇంకేమనాలో మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Realtor: అప్పులు చేసి అపార్ట్‌మెంట్ నిర్మాణం, ఫ్లాట్స్ అమ్ముడవక ఆత్మహత్య

గుజరాత్- మహిళ బట్టలు విప్పి, దాడి చేసి, మోటార్ సైకిల్ చక్రానికి కట్టి ఈడ్చుకెళ్లారు..

ఫిబ్రవరి 2న జనంలోకి జనసేన.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం

రాత్రికి రాత్రే అంతా మారిపోదు.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్.. చంద్రబాబు

హైదరాబాద్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించిన కిస్నా డైమండ్ జ్యువెలరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments