Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడు న‌డిపిస్తున్నాడు, అందుకే కెరీర్లో ప్రత్యేక పాత్ర‌లు వ‌స్తున్నాయిః పూజా హెగ్డే

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (16:51 IST)
Pooja Hegde
పూజా హెగ్డే.. ప్రస్తుతం ఈ పేరుకు ఎంత క్రేజ్ వుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను దేవుడిన్ని న‌మ్ముతాన‌నీ, ఆయ‌నే లేకుండా నేను మీ ముందు ఇలా పేరు ప్ర‌ఖ్యాతులతో వుండే దానిని కాద‌ని చెబుతోంది. మ‌న జీవితంలో ఏది జ‌ర‌గాలో అది జ‌రిగితీరుతుంద‌ని అంటోంది. క‌ర్మ సిద్దాంథాన్ని బాగా న‌మ్ముతాన‌ని అంటున్న పూజ జన్మదినం  అక్టోబర్ 13. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఇండస్ట్రీలోని ప్రముఖులు, శ్రేయోభిలాషులు ఆమెకు బర్త్ డే విషెస్ చెప్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు పూజా హెగ్డే. స్టార్ హీరోలందరితో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు ఈ ముద్దుగుమ్మ. తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరితో జోడి కడుతూ అగ్రపీఠం వైపు దూసుకుపోతున్నారు.
 
పూజా హెగ్డే. ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాతో పాటు అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు పూజా హెగ్డే. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో విభ పాత్రలో నటిస్తున్నారు పూజా. ఇప్పటి వరకు తన కెరీర్లో చేయనటువంటి ఒక హుషారైన పాత్రలో ఇందులో నటించారు పూజ హెగ్డే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని నమ్మకంగా చెబుతున్నారు ఈమె. ఖచ్చితంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలైన తర్వాత విభ పాత్ర అందరికీ గుర్తుండిపోతుందని చెబుతున్నారు పూజ. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అభిమానులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments