ఏ మాయ చేసావె సీక్వెల్‌లో ''మాధవన్''.. ఆ కాంబో మళ్లీ రిపీట్..?

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా "ఘర్షణ" ఫేం గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ కృష్ణ సమర్పణలో ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ స్వరూప్ నిర్మించిన "ఏ మాయ చేసావె" సినిమా బంపర్ హిట్ అయ్

Webdunia
బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (15:34 IST)
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా "ఘర్షణ" ఫేం గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ కృష్ణ సమర్పణలో ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ స్వరూప్ నిర్మించిన "ఏ మాయ చేసావె" సినిమా బంపర్ హిట్ అయ్యింది. సమంత, నాగచైతన్య జంటగా నటించిన ఈ సినిమా యూత్ మధ్య మంచి క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. 
 
ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ వచ్చేస్తోంది. ఈ మూవీ సీక్వెల్‌లో మాధవన్ నటించనున్నాడు. ఈ విషయాన్ని మాధవనే స్వయంగా ప్రకటించాడు.  అలాగే టివినో థామస్, పునీత్ రాజ్‌కుమార్‌లు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించనున్నారు. త్వరలో సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. 
 
ఇకపోతే, గౌతమ్‌తో మాధవన్ 2001లో మిన్నలె(తెలుగులో చెలి) చిత్రానికి గానూ కలిసి పనిచేశారు. మళ్లీ గౌతమ్ మీనన్, మాధవన్ కాంబినేషన్ దాదాపు 17 సంవత్సరాల రిపీట్ అవుతోంది. మరి ఈ సినిమా తెలుగు సీక్వెల్‌ కోసం గౌతమ్ మీనన్ చైతూనే తీసుకుంటాడా? లేకుంటే వేరొక హీరోను ఎంచుకుంటాడా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

గ్రీన్‌ఫీల్డ్ అమరావతి.. రైతు సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తాం.. మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments