''అర్జున్ రెడ్డి''లో హీరోయిన్‌గా సుబ్బులక్ష్మి: అబ్బే అవన్నీ పుకార్లే గౌతమి

సీనియర్ నటి గౌతమి.. సినీ లెజెండ్ కమల్ హాసన్‌తో తెగతెంపులు చేసుకుంది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో గౌతమికి మంచి పేరుంది. ప్రస్తుతం ఆ

Webdunia
మంగళవారం, 13 మార్చి 2018 (13:03 IST)
సీనియర్ నటి గౌతమి.. సినీ లెజెండ్ కమల్ హాసన్‌తో తెగతెంపులు చేసుకుంది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో గౌతమికి మంచి పేరుంది. ప్రస్తుతం ఆ పేరుతో తన నట వారసురాలిగా తన కుమార్తెను సినీ అరంగేట్రం చేయించాలనుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఈ క్రమంలో తమిళంలో రీమేక్ అవుతోన్న ''అర్జున్ రెడ్డి'' సినిమాలో కథానాయికగా సుబ్బులక్ష్మి ఎంపిక జరిగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. 
 
ఇంకా ధృవ్ హీరోగా చేయనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా గౌతమి కుమార్తెను ఎంపిక చేసినట్లు కోలీవుడ్‌లో టాక్ వస్తోంది. అయితే ఈ వార్తలను గౌతమి కొట్టిపారేశారు. ప్రస్తుతానికి తన కుమార్తె నటించదని.. చదువుపైనే సుబ్బులక్ష్మి పూర్తిగా దృష్టి పెట్టిందని స్పష్టం చేసింది. నటనాపరంగా ఎలాంటి ప్లాన్స్ లేవని, అర్జున్ రెడ్డి సినిమాలో సుబ్బు నటిస్తున్నట్లు వార్తలన్నీ కేవలం ప్రచారం మాత్రమేనని.. అవన్నీ పుకార్లేనని గౌతమి ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండిగో సంక్షోభంపై నోరెత్తిన కేటీఆర్.. సంపద కొన్ని సంస్థల చేతుల్లోనే కూరుకుపోయింది..

పుతిన్-మోడీ ఫ్రెండ్‌షిప్‌ని మా ట్రంప్ దృఢతరం చేసారు, ఇవ్వండి నోబెల్ అవార్డ్, ఎవరు?

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments