Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మనువడిని ప్రేమిస్తే తాతయ్య వాడుకున్నాడు.. చివరికి ఆ యువతి?

వయోభేదం లేకుండా కామాంధులు పెచ్చరిల్లిపోతున్నారు. తన మనువడిని ప్రేమించిన పాపానికి ఓ వృద్ధ కామాంధుడు రెచ్చిపోయాడు. వరుసకు మనవరాలైనా.. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడటం ద్

Advertiesment
మనువడిని ప్రేమిస్తే తాతయ్య వాడుకున్నాడు.. చివరికి ఆ యువతి?
, సోమవారం, 5 మార్చి 2018 (15:32 IST)
వయోభేదం లేకుండా కామాంధులు పెచ్చరిల్లిపోతున్నారు. తన మనువడిని ప్రేమించిన పాపానికి ఓ వృద్ధ కామాంధుడు రెచ్చిపోయాడు. వరుసకు మనవరాలైనా.. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడటం ద్వారా ఆమె గర్భం ధరించింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, తిరుప్పూరు జిల్లా తారాపురం ప్రాంతానికి చెందిన 17ఏళ్ల యువతి 12వ తరగతి చదువుతోంది. 
 
ఆ యువతి తల్లి ఇటీవల మృతిచెందింది. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా ఆమె కడుపు పెరిగినట్లు వుండటంతో బంధువులు ఆరా తీశారు. ఇంకా కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆ యువతిని పరిశోధించిన వైద్యులు ఆమె ఆరునెలల గర్భం అని తేల్చారు. దీన్ని విని షాక్ అయిన బంధువులు గర్భానికి కారణం ఎవరంటూ అడగడంతో వాస్తవమేమిటో వెలుగులోకి వచ్చింది.
 
తారాపురం ప్రాంతానికి చెందిన మనోజ్ కుమార్ తనను ప్రేమ పేరిట లొంగదీసుకున్నట్లు తెలిపింది. దీనిపై బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు విచారణలో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. ప్లస్ టూ చదివే విద్యార్థిని గర్భం ధరించేందుకు మనోజ్ కుమార్ ఒక్కడే కారణం కాదని.. అతడి తాతయ్య మోసస్ (65) కూడా కారణమని తెలియవచ్చింది. 
 
మనోజ్‌ కుమార్‌ తనను లోబరుచుకున్న విషయం బయటికి తెలియకుండా వుండాలంటే.. తనతో పడక పంచుకోవాల్సిందేనని మోసస్ యువతిని బెదిరించి.. ఆమెపై అనేకమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు కూడా వెల్లడించింది. దీంతో మనోజ్ కుమార్, మోసస్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాతీయ హీరోగా కేసీఆర్... తదుపరి ఆయన ప్లాన్ ఏంటంటే?