Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మతోడు.. తాగి డ్రైవ్ చేయలేదు : హీరో రాజశేఖర్

ఇటీవల హీరో రాజశేఖర్ హైదరాబాద్ నగరంలో కారు యాక్సిడెంట్ చేసిన విషయంతెల్సిందే. దీనిపై అప్పుడే వివరణ ఇచ్చినప్పటికీ.. దీనికి సంబంధించిన వార్త ఒకటి ఇపుడు ఎలక్ట్రానిక్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ మధ్య రాజశ

Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (18:53 IST)
ఇటీవల హీరో రాజశేఖర్ హైదరాబాద్ నగరంలో కారు యాక్సిడెంట్ చేసిన విషయంతెల్సిందే. దీనిపై అప్పుడే వివరణ ఇచ్చినప్పటికీ.. దీనికి సంబంధించిన వార్త ఒకటి ఇపుడు ఎలక్ట్రానిక్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ మధ్య రాజశేఖర్ తాగేసి డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేశాడన్నది ఆ వార్త సారాంశం. 
 
దీనిపై ఆయన మరోమారు వివవరణ ఇచ్చారు. "ఆ రోజు నేను.. జీవిత.. ప్రవీణ్ సత్తారు కూర్చుని 'గరుడవేగ' ప్రమోషన్స్ గురించి మాట్లాడుతున్నాం. నేను చేసిన సూచనలు జీవితకి నచ్చకపోవడంతో నాకు కోపం వచ్చేసింది. దాంతో చెన్నైకి వెళ్లిపోదామనే ఉద్దేశంతో కారు తీసుకుని ఎయిర్ పోర్టుకు వెళ్లాను. ఆ తర్వాత నిర్ణయం మార్చుకుని వెనుదిరిగాను" అన్నారు.
 
"ఆ కారు ఆ రోజే రిపేరుకు వెళ్లి వచ్చింది.. సరిగ్గా బ్రేకులు పడలేదు. దానికితోడు మా అమ్మ చనిపోయిన తర్వాత నేను యాంటీ డిప్రెసివ్ టాబ్లెట్స్ 4 రకాలవి 3 పూటలా వాడుతున్నాను. మెడిసిన్ బ్యాగ్ ఎప్పుడూ నాతోనే ఉంటుంది. కోపం తగ్గడం కోసం రాత్రి వేసుకోవలసిన టాబ్లెట్ కూడా ముందుగానే వేసేసుకున్నాను అని చెప్పారు. 
 
ఒక చోట నేను కారు ఆపగా.. ఆ వ్యక్తి తన కారును తీసుకొచ్చి నా కారు ముందు ఆపాడు. నేను కారు తీస్తుండగా .. ఆయన కారుకు తగిలింది. నేను వేసుకున్న నిద్రమాత్ర పనిచేస్తుండటం వలన.. కారు బ్రేక్ సరిలేనందుకు అలా జరిగింది. అంతేగానీ .. నిజంగానే నేను తాగలేదు.. ఆ విషయం పోలీసులు చేసిన టెస్టులోను తేలింది" అని వివరణ ఇచ్చారు. 
 
కాగా, రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన "పీఎస్వీ గరుడవేగ" చిత్రం ఇటీవల విడుదలై సూపర్ డూపర్ హిట్ సాధించడమే కాకుండా, కాసుల వర్షం కురిపించింది. దీంతో ఆ ప్రమాదం గురించి ప్రతి ఒక్కరూ మరిచిపోయారు. కానీ, ఎలక్ట్రానిక్‌తో పాటు సోషల్ మీడియాలో ఈ వార్త పదేపదే ప్రసారమవుతుండటంతో రాజశేఖర్ మరోమారు వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nagababu: శాసన మండలి సభ్యుడిగా నాగబాబు ప్రమాణ స్వీకారం

నియంత్రణ రేఖ దాటొచ్చిన పాకిస్థాన్‌ సైన్యానికి భారత్ చేతిలో చావుదెబ్బ!

కంచా అడవిని కాపాడండి-బంజరు భూముల్ని వాడుకోండి- దియా, రేణు దేశాయ్, రష్మీ గౌతమ్ విజ్ఞప్తి

శునకంతో స్టంట్ చేసిన వ్యక్తి.. రైలు కింద పడిపోయింది.. తిట్టిపోస్తున్న నెటిజన్లు (video)

ప్రధాని మోడీ గారూ.. సమయం ఇవ్వండి.. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించాలి : సీఎం స్టాలిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments